New Delhi, June 17: భారత, చైనా సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తతలు (India-China Border Face-off) నెలకొన్న విషయం తెలిసిందే. సోమవారం రాత్రి జరిగిన దాడిలో గాల్వన్‌లో 20 మంది భారతీయ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో భారత, చైనా సరిహద్దు విషయాన్ని చర్చించేందుకు ప్రధాని మోదీ అఖిల పక్ష సమావేశాన్ని (all-party meeting) ఏర్పాటు చేశారు. ఈనెల 19వ తేదీన సాయంత్రం 5 గంటలకు అఖిల పక్ష భేటీ ఉంటుందని ప్రధానమంత్రి కార్యాలయం (PMO Office) పేర్కొన్నది. ఈ సమావేశంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన అధ్యక్షులు పాల్గొంటారని పీఎంవో ఓ ప్రకటనలో తెలియజేసింది. సరిహద్దుల్లో నెత్తుటి ధారలపై స్పందించిన అమెరికా, అక్కడ అసలేం జరుగుతోంది, 20 మంది భారత జవాన్లు మృతి వెనుక చైనా చిమ్మిన విషం ఏమిటీ?
లద్దాఖ్‌లో చైనా సైనికులతో తలపడి వీరమరణం పొందిన భారత జవాన్ల కుటుంబాలకు రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సంఘీభావం తెలిపారు. సరిహద్దులో దేశాన్ని అనుక్షణం కాపాల కాస్తున్న సైనికుల త్యాగాలను, ధైర్యాన్ని దేశం ఎన్నడూ మరిచిపోదని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Defence Minister Rajnath Singh) తెలిపారు. గాల్వన్ వ్యాలీలో 20 మంది సైనికులు మృతిచెందిన ఘటనపై ఆయన ట్విట్టర్ ద్వారా స్పందించారు. గాల్వన్ దాడిలో చనిపోయిన సైనికుల కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు.
Here's PMO Tweet
In order to discuss the situation in the India-China border areas, Prime Minister @narendramodi has called for an all-party meeting at 5 PM on 19th June. Presidents of various political parties would take part in this virtual meeting.
— PMO India (@PMOIndia) June 17, 2020
Here's Rajnath Singh Tweet
The Nation will never forget their bravery and sacrifice. My heart goes out to the families of the fallen soldiers. The nation stand shoulder to shoulder with them in this difficult hour. We are proud of the bravery and courage of India’s breavehearts.
— Rajnath Singh (@rajnathsingh) June 17, 2020
క్లిష్ట సమయంలో దేశం అంతా కలిసి కట్టుగా ఉన్నదన్నారు. భారతీయ బ్రేవ్‌హార్ట్స్ పట్ల గర్వంగా ఉందన్నారు. గాల్వన్‌లో సైనికులు చనిపోవడం బాధాకరం అని అన్నారు. ఆ ఘటన చాలా కలిచివేసిందన్నారు. సరిహద్దు విధుల్లో మన సైనికులు అత్యంత ధైర్యసాహాసాలు ప్రదర్శించినట్లు ఆయన తెలిపారు. అత్యున్నత స్థాయిలో సైనికులు తమ ప్రాణాలను త్యాగం చేశారని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు. సరిహద్దుల్లో తెలుగు బిడ్డ వీర మరణం, కల్నల్ బిక్కుమల్ల సంతోష్ బాబు చైనా సరిహద్దు ఘర్షణల్లో మృతి, దేశం కోసం అమరుడయ్యాడన్న కల్నల్ తల్లి
తూర్పు లదాఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా సైనికులతో పోరులో 20 మంది భారతీయ సైనికులు అమరులవడంపై కాంగ్రెస్ పార్టీ (Congress Party) దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సైనికుల వీరమరణం తనకు చాలా బాధను కలిగించిందని ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఓ ప్రకటనలో తెలిపారు. దేశ భద్రత, ప్రాదేశిక సమగ్రత విషయంలో తామంతా కలిసికట్టుగా ఉంటామని ఆమె పేర్కొన్నారు. సైనికుల మృతి పట్ల దిగ్భ్రాంతి చెందానని, తన వ్యధను మాటల్లో చెప్పలేనని ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. గాల్వన్ ఘటన జాతీయ భద్రతకు సంబంధించి అత్యంత ఆందోళన కలిగించే అంశమని, ఇటువంటి పరిస్థితుల్లో దేశానికి కేంద్ర ప్రభుత్వం భరోసా ఇవ్వాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ కోరారు.
Here's Rahul Gandhi Tweet
Why is the PM silent?
Why is he hiding?
Enough is enough. We need to know what has happened.
How dare China kill our soldiers?
How dare they take our land?
— Rahul Gandhi (@RahulGandhi) June 17, 2020
Words cannot describe the pain I feel for the officers and men who sacrificed their lives for our country.
My condolences to all their loved ones. We stand with you in this difficult time.
— Rahul Gandhi (@RahulGandhi) June 16, 2020
గాల్వన్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఎందుకు మౌనంగా ఉన్నారని మరో కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా ప్రశ్నించారు. చైనా దుశ్చర్యలకు కేంద్రం దీటుగా స్పందించాల్సిన సమయం ఆసన్నమైందని పంజాబ్ సీఎం అమరిందర్ సింగ్ అన్నారు. ఉద్రిక్తతను సడలించే ప్రక్రియలో ముగ్గురు భారత సైనికులను చైనా సైనికులు చంపగలిగారంటే క్షేత్ర స్థాయిలో పరిస్థితులు ఎంత తీవ్రంగా ఉన్నాయో ఈ ఘటన ద్వారా అర్థం చేసుకోవచ్చని నేషనల్ కాన్ఫరెన్స్ నాయకుడు ఒమర్ అబ్దుల్లా అన్నారు.
సరిహద్దు సమస్యలపై దేశానికి కేంద్రం స్పష్టమైన వైఖరిని తెలియజేయాలని మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ అన్నారు. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించేందుకు భారత్, చైనా వెంటనే చర్చలు ప్రారంభించాలని సీపీఎం డిమాండ్ చేసింది. కాగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సరిహద్దులు చెక్కుచెదరవని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ‘కేరళ జన్‌సంవాద్’ ర్యాలీలో ఆన్‌లైన్‌లో ఆయన మాట్లాడారు. చైనా దుశ్చర్యలకు భారత్ దీటుగా జవాబిచ్చిందని, అయితే ఈ క్రమంలో మన సైనికులు అమరులవడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
వాస్తవ నియంత్రణ రేఖ వద్ద భారత్, చైనా సైనికుల ఘర్షణపై ఐక్యరాజ్య సమితి స్పందించింది. ఇరు దేశాల సైనికుల మధ్య హింస చోటుచేసుకోవడంపై ఐరాస చీఫ్ ఆంటోనియో గుటెర్రెస్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇరు దేశాలూ సంయమనం పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తూర్పు లద్దాఖ్‌లోని గాల్వాన్ ప్రాంతంలో భారత్ చైనా సైనికుల మధ్య నిప్పు ఎలా రాజుకుందనే విషయంపై అనేక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. పాయింట్ 14 అనే వివాదాస్పద ప్రాంతంలో చైనా సైనికులు ఓ స్థావరాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఘర్షణకు బీజం పడిందని అధికార వర్గాల అనధికార సమాచారం. గతంలో ఇదే ప్రాంతంలో ఇరు దేశాల సైనిక ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరిగాయి. అనంతరం అక్కడి నుంచి సైనికులను వెనక్కు రప్పించేందుకు అంగీకారం కుదిరింది.
అయితే సోమవారం నాడు పాయింట్ 14 వద్ద చైనా సైనికులు ఓ టెంట్ ఏర్పాటు చేయడాన్ని భారత జవాన్లు గుర్తించారు. ఒప్పందం ప్రకారం అక్కడి నుంచి వెనక్కు మళ్లాలని భారత జవాన్లు సూచించారు. ఈ శాంతియుత విన్నప్పాన్ని తిరస్కరిస్తూ చైనా సైనికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. దీంతో భారత జవాన్లు కూడా ప్రతిదాడికి దిగాల్సి వచ్చింది. చైనా జవాన్తు ఇనుప ముళ్లు ఉన్న కర్రలతో విరుచుకుపడినా కూడా భారత్ సైనికులు ఏమ్రాతం వెనక్కుతగ్గకుండా వారిని ఎదుర్కొన్నారని తెలిసింది. ఈ ఘర్షణలో 20 మందికి పైగా భారత సైనికులు ప్రాణాలు కోల్పోగా మరో నలుగురి పరిస్థితి విషమయంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇక చైనాకు జరిగిన నష్టం గురించి అక్కడి ప్రభుత్వం ఇప్పటి వరకూ ఎటువంటి బహిరంగ ప్రకటనా చేయకపోయినప్పటికీ.. భారత సైనికులు జరిపిన ప్రతిదాడిలో ఓ కమాండింగ్ స్థాయి అధికారి మృతి చెందినట్టు తెలుస్తోంది. 45 మందిదాకా చైనా సైనికులు కూడా మరణించారని సమాచారం.
లఢక్‌లోని గాల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ముఖాముఖి ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబుతోసహా 20 మంది జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధవారం చైనాకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పలు చోట్ల జనం మాస్కులు ధరించి ర్యాలీలు నిర్వహించారు. చైనా జెండాలతోపాటు ఆ దేశాధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టి బొమ్మలను దహనం చేశారు. ఆ దేశంలో తయారయ్యే వస్తువులను కూడా కాల్చివేశారు. చైనా వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఆ దేశంలో తయారయ్యే వస్తువులను బహిష్కరించాలని డిమాండ్ చేశారు.