Citizenship Amendment Act: ఎట్టకేలకు సీఏఏ అమల్లోకి, 2019 డిసెంబర్ 11న పార్లమెంట్ ఆమోదం, ముస్లీంలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్న కేంద్ర ప్రభుత్వం, దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న నిరసనలు
పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act (CAA))జనవరి 10వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని కేంద్రం శుక్రవారం ప్రకటించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో ( Pakistan, Bangladesh, Afghanistan ) మత వివక్ష ఎదుర్కొని భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన హిందూ, సిఖ్, జైన్, పార్శీ, క్రిస్టియన్, బౌద్ధ మతస్తులకు(Hindu, Christian, Sikh, Buddhist and Parsi communities) భారత పౌరసత్వం( Indian citizenship) కల్పించేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు.
New Delhi, January 11: పౌరసత్వ సవరణ చట్టం (Citizenship Amendment Act (CAA))జనవరి 10వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిందని కేంద్రం శుక్రవారం ప్రకటించింది. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌ల్లో ( Pakistan, Bangladesh, Afghanistan ) మత వివక్ష ఎదుర్కొని భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన హిందూ, సిఖ్, జైన్, పార్శీ, క్రిస్టియన్, బౌద్ధ మతస్తులకు(Hindu, Christian, Sikh, Buddhist and Parsi communities) భారత పౌరసత్వం( Indian citizenship) కల్పించేందుకు ఈ చట్టాన్ని రూపొందించారు. కాగా పౌరసత్వ సవరణ బిల్లుకు 2019 డిసెంబర్ 11న పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం విదితమే.
ఎస్పీజీ సవరణ బిల్లు రాజ్యసభలో ఆమోదం
అయితే, ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా తీవ్ర స్థాయిలో ఉద్యమం కొనసాగుతోంది. కాగా, సీఏఏ పేరుతో దేశంలో తొలిసారి మతం ఆధారంగా పౌరసత్వాన్ని కల్పిస్తున్నారని, రాజ్యాంగంలోని మౌలిక సిద్ధాంతాలను ఈ చట్టం ఉల్లంఘిస్తోందని ఆరోపిస్తూ ముస్లింలతోపాటు విపక్ష పార్టీలు ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
పౌరసత్య సవరణ బిల్లు లోక్‌సభలో ఆమోదం
దేశాన్ని మత పరంగా విభజించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తోందని ఆరోపిస్తూన్నారు. సీఏఏకి వ్యతిరేకంగా నెల రోజులుగా దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Official Notification of The Act:
మూడు పొరుగు దేశాల నుండి 2014 కి ముందు భారతదేశానికి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు మాత్రమే పౌరసత్వం ఇస్తానని హామీ ఇచ్చే ఈ చట్టం దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. రాజ్యాంగంలోని ప్రాథమిక సిద్ధాంతాలను ఉల్లంఘించి.. మతం ఆధారంగా భారతదేశం ( India) మొదటిసారి పౌరసత్వం ఇస్తుందని ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న వారు అంటున్నారు.
పౌరసత్వ (సవరణ) బిల్లు-2019కు రాజ్యసభ ఆమోదం
సీఏఏ ఆమోద యోగ్యం కాదని, రద్దు చేయాలని పలువురు మేధావులు సైతం డిమాండ్ చేశారు. అయితే.. దేశ ప్రయోజనాల కోసమే ఈ చట్టం తెచ్చామని బీజేపీ చెబుతోంది. ఈ చట్టంతో ముస్లింలకు ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పింది.
పౌరసత్వ సవరణ బిల్లు అంటే ఏమిటి?
ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హామీ ఇచ్చింది. రాజకీయ లబ్ది కోసమే కొన్ని పార్టీలు ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నాయని, దుష్ప్రచారం చేస్తున్నాయని బీజేపీ(BJP) ఆరోపించింది.
ముస్లింలకు150 దేశాలు ఉన్నాయి, హిందువులకు ఇండియా ఒక్కటే ఉంది
దేశంలో అక్రమ వలసదారులను ఏరివేస్తాం