CAB protest: Violent protests continue in West Bengal, several buses, railway station torched (Photo-PTI)

Kolkata, December 15: అధికార పార్టీ బీజేపీ(BJP) ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (amended Citizenship Act) కొన్ని రాష్ట్రాల్లో నిప్పు రాజేస్తోంది. దీనిని వ్యతిరేకిస్తున్న ఆయా రాష్ట్రాల ప్రజలు రోడ్లపైకి ఎక్కుతున్నారు. ఆందోళనలు హింసాత్మకరూపంగా మారుతున్నాయి. ప్రధానంగా పశ్చిమబెంగాల్‌లో నిరసనలు మిన్నంటాయి.

ఏకంగా రైల్వే స్టేషన్ కే నిప్పంటిస్తున్నారు. లగోలా రైల్వే స్టేషన్‌లో నిలిపి ఉంచిన ఐదు రైళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.అలాగే సక్రయిల్ రైల్వే స్టేషన్‌లో టికెట్ కౌంటర్‌ను నిరసనకారులు తగులబెట్టారు. నిరసనకారులను అడ్డుకొనేందుకు RPF, రైల్వే సిబ్బంది ప్రయత్నించారు. అయినా వారు ఆగడం లేదు. ఆందోళనను తీవ్రతరం చేస్తున్నారు.  బీజేపీ ఎంపీ కారుపై బాంబు దాడి, క్షేమంగా బయటపడిన బరాక్ పూర్ ఎంపీ అర్జున్ సింగ్

ఈ నేపథ్యంలో హౌరా, ముర్షీదాబాద్ జిల్లాల్లో హింసాత్మక సంఘటనలు నమోదయ్యాయి. రాస్తారోకోలు, ప్రభుత్వ ఆస్తులు, రైల్వే స్టేషన్ల విధ్వంసం(railway station torched) జరిగాయి. నిరసనకారుల చర్యల వల్ల వాహనాలు, రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి.

ఉలుబేరియా రైల్వే స్టేషన్‌లో ఓ రైలు ఇంజిన్‌పైకి కొందరు రాళ్ళు రువ్వారు, రైల్వే ట్రాక్‌లపై అడ్డంకులు పెట్టారు. ముర్షీదాబాద్ వ్యాప్తంగా రైల్వే సేవలకు అంతరాయం ఏర్పడింది. జంగీపూర్, మహిపాల్, ఇతర రైల్వే స్టేషన్లకు సమీపంలో రైళ్ళను నిలిపేశారు. కొన్ని రైళ్ళను రద్దు చేశారు.

Mamata Banerjee Fire

నిరసనకారులు రోడ్లపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు తలెత్తాయి. కొందరు ఆందోళనకారులు బస్సులపై రాళ్ళు రువ్వారు. ఎలాంటి ఆందోళనలకు దిగొద్దని సీఎం మమత బెనర్జీ సూచిస్తున్నారు. ప్రజలను ఇబ్బందికి గురి చేయవద్దని..చట్టాన్ని చేతుల్లోకి తీసుకొంటే మాత్రం సహించేది లేదని హెచ్చరించారు. దీనిపై గవర్నర్ స్పందించారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత చట్టంగా మారిపోయిందని అందరూ ఆమోదించాలని సూచించారు.

ఈ క్రమంలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ ఆందోళనకారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో విధ్వంసాలకు పాల్పడితే చూస్తూ ఊరుకోమని కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ బిల్లుపై ప్రజలు తమ నిరసనను శాంతి, ప్రజాస్వామ్యయుతంగా తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోరాదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

దేశవ్యాప్తంగా పౌరసత్వ సవరణ చట్టం అమలు చేస్తామని కేంద్రం చెబుతుండగా.. జాతీయ పౌర రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ)ని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి దీదీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ చట్టాలు తమ రాష్ట్రంలో అమలుకానీయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే పార్లమెంట్‌ ఆమోదించిన పౌరసత్వ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ పశ్చిమబెంగాల్‌లో అనేక చోట్ల ఆందోళనకారులు విధ్వంసం సృష్టిస్తున్నారు.

East Coast Railway Tweet

ఆందోళన కారుల దెబ్బకు పలు రైళ్లు కూడా రద్దు చేయబడ్డాయి.

రద్దు చేసిన రైళ్లు

12847/12848 హౌరా-దిఘా ఎసి ఎక్స్‌, 12222 హౌరా-పూణే డురాంటో ఎక్స్‌, 120889 హౌరా-తిరుపతి హమ్‌సాఫర్ ఎక్స్‌ప్రెస్, 12860 హౌరా-సిఎస్‌ఎమ్‌టి గీతాంజలి ఎక్స్‌, 22877 హౌరా- ఎర్నాకుళం అంతోదయ ఎక్స్‌ప్రెస్, 22897/22898 హౌరా exp.

హౌరా నుండి 12841 కోరొమోండల్ ఎక్స్‌ప్రెస్, 12245 హౌరా- యశ్వంత్‌పూర్ డురాంటో ఎక్స్‌ప్రెస్, 18645 హౌరా-హైదరాబాద్ ఈస్ట్ కోస్ట్ ఎక్స్‌ప్రెస్ కూడా రద్దు చేయబడ్డాయి.

డిసెంబర్ 15 న పూరి నుండి పూరి-దిఘా ఎక్స్‌ప్రెస్, పూరి-సాంట్రాగచి ప్యాసింజర్‌ను రద్దు చేసినట్లు రైల్వే శాఖ ఓ ఒక ప్రకటనలో తెలిపింది.