West Bengal BJP MP Arjun Singh Car attacked in Kalimpong district (Photo-ANI)

Barrackpore, December 4: పశ్చిమబెంగాల్(West Bengal)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పౌరసత్వ బిల్లుకు నిరసనగా దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుతున్న నేపథ్యంలో బీజేపీ ఎంపీపై(BJP MP) దాడి జరగడం అక్కడ ఉద్రిక్త పరిస్థితులను రాజేస్తోంది. బరాక్ పూర్ బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ (Barrackpore MP Arjun Singh) కారుపై గుర్తు తెలియని వ్యక్తులు ముందు ఇటుకలతో దాడి చేశారు. ఆ తర్వాత కారుకి సమీపంలో బాంబు విసిరారు.

ఈ ఘటనలో బీజేపీ ఎంపీ సేఫ్ గా బయటపడ్డారు. ఏదో పని మీద కారులో వెళ్తుండగా.. ఎంపీ వాహనాన్ని కొందరు దుండగులు అడ్డగించారు. ఆ తర్వాత దాడికి పాల్పడ్డారు. దీనిపై బీజేపీ ఎంపీ అర్జున్ సింగ్ తీవ్రంగా స్పందించారు. అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ కి చెందిన వారే తనపై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనం అన్నారు. వెంటనే వెస్ట్ బెంగాల్ లో రాష్ట్రపతి పాలన విధించాలని ఆయన డిమాండ్ చేశారు. పోలీసులు దీనిపై విచారణ సాగిస్తున్నారు.

ANI Tweet

ఇదిలా ఉంటే సిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ యాక్ట్‌ (సిఎఎ)ను వ్యతిరేకిస్తూ పశ్చిమ బెంగాల్‌లో ఆందోళనలు ఉధృతమవుతున్నాయి. దీనిపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Chief Minister Mamata Banerjee) స్పందించారు. ఆందోళనకారులు అల్లర్లు సృష్టించవద్దని, హింసకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. రోడ్లపై అడ్డంకులు పెట్టవద్దన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని ఆమె హెచ్చరించారు. నిరసనకారులు హింసకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె చెప్పారు. రాష్ట్రంలో సిఎఎ, ఎన్‌ఆర్‌సి అమలు చేయనీయబోమని ఆమె స్పష్టం చేశారు.