Delhi Schools Closed : ఢిల్లీలో స్కూళ్లకు హాలిడేస్‌, వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు మూసివేస్తున్నట్లు సీఎం ప్రకటన

దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు (Holiday for schools) ప్రకటించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. యమునా నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుండటంతో...పరివాహక ప్రాంతాల్లో భారీగా వరద పెరిగింది.

Delhi Rains

New Delhi, July 13: యమునానదిలో వరద (Yamuna Flood) ఉధృతి పెరిగింది. దీంతో ఢిల్లీలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో స్కూళ్లకు సెలవులు (Holiday for schools) ప్రకటించారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. యమునా నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుండటంతో...పరివాహక ప్రాంతాల్లో భారీగా వరద పెరిగింది. 45 ఏళ్ల రికార్డును యమునా నది తుడిచి పెట్టేసింది. లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం (Delhi Floods) అయ్యాయి.

ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే సహాయక చర్యలు ప్రారంభించారు. గత ఐదు రోజులుగా ఢిల్లీలో కురిసిన వర్షం కారణంగా విద్యాసంస్థలను మూసేశారు. తాజాగా వరద ఉధృతి తగ్గకపోవడంతో స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించింది ప్రభుత్వం.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif