CM Revanth Reddy: గ్రూప్-4 విజేతలకు నేడు నియామక పత్రాలు అందజేయనున్న సీఎం రేవంత్,పెద్దపల్లిలో 8 వేల 143 మందికి సీఎం చేతుల మీదుగా నియామక పత్రాలు
ఇక ఇవాళ పెద్దపల్లిలో జరిగే విజయోత్సవ సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా గ్రూప్-4 విజేతలకు నియామక పత్రాలు అందజేయనున్నారు.
Hyd, Dec 4: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం గడుస్తున్న నేపథ్యంలో ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇవాళ పెద్దపల్లిలో జరిగే విజయోత్సవ సభలో పాల్గొననున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా గ్రూప్-4 విజేతలకు నియామక పత్రాలు అందజేయనున్నారు.
వివిధ శాఖల్లో గ్రూప్ 4 ఉద్యోగాలకు ఎంపికైన 8 వేల 143 మందికి నియామక పత్రాలు ఇవ్వనున్నారు. వైద్యారోగ్య శాఖ ఎంపిక చేసిన 442 మంది అసిస్టెంట్ సర్జన్లు, సింగరేణి ఉద్యోగాలు దక్కించుకున్న 593 మంది కూడా పత్రాలు అందుకోనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో 54 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగరమే మన ఆదాయం... ఆత్మగౌరవం, అంతర్జాతీయ పెట్టుబడులతో అభివృద్ధి చేస్తాం, హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పెరిగిందన్న సీఎం రేవంత్ రెడ్డి
గ్రూప్ 4 విజేతలతో పాటు సింగరేణిలో వివిధ ఉద్యోగాలకు ఎంపికైన 593 మందికి కూడా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు ఇవ్వనున్నారు. ఈ ఏడాదిలో 2 వేల 165 ఉద్యోగ నియామకాలు చేపట్టినట్లు సింగరేణి సంస్థ వెల్లడించింది.