Cocaine worth Rs 900 crore seized: ఢిల్లీలో భారీ ఎత్తున డ్రగ్స్ పట్టివేత, ఏకంగా రూ. 900 కోట్ల విలువైన కొకైన్, ఇతర మాదక ద్రవ్యాలు సీజ్
రూ.900 కోట్లు విలువచేసే 80 కిలోలకు పైగా కొకైన్ (Cocaine)ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్టు చేశారు. మరోవైపు గుజరాత్ తీరంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), నేవీ, గుజరాత్ ఏటీఎస్‌లు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో 700 కిలోల మెథాంఫేటమిన్ స్వాధీనం చేసుకున్నాయి.
New Delhi, NOV 15: దేశ రాజధానిలో మాదకద్రవ్యాల గుట్టు రట్టయ్యింది. రూ.900 కోట్లు విలువచేసే 80 కిలోలకు పైగా కొకైన్ (Cocaine)ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు కీలక వ్యక్తులను అరెస్టు చేశారు. మరోవైపు గుజరాత్ తీరంలో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB), నేవీ, గుజరాత్ ఏటీఎస్‌లు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో 700 కిలోల మెథాంఫేటమిన్ స్వాధీనం చేసుకున్నాయి. అంతర్జాతీయ డ్రగ్ ముఠాకు చెందిన ఎనిమిది మందిని అరెస్టు చేశారు. వీరంతా ఇరాన్ పౌరులుగా గుర్తించారు.
భారీ స్థాయిలో డ్రగ్స్‌ను పట్టుకోవడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా (Amit Shah) స్పందించారు. డ్రగ్ రాకెట్లపై వేట కొనసాగుతుందన్నారు. ఈ సందర్భంగా అధికారుల ఆపరేషన్లను ప్రశంసించిన ఆయన.. మాదకద్రవ్యాల రహిత భారత్ నిర్మాణంలో ఇదో కీలక పురోగతి అన్నారు. దిల్లీలో పట్టుబడిన డ్రగ్స్ విలువ రూ.900 కోట్లు ఉంటుందన్నారు. ఢిల్లీలో ఈ స్థాయిలో మాదకద్రవ్యాలు సీజ్ చేయడం ఇటీవల ఇదే తొలిసారి.