LPG Cylinder Prices Hike: నేటి నుంచి గ్యాస్ బాదుడు షురూ, 19 కేజీల సిలిండర్ ధరపై రూ.105, 5కేజీల సిలిండర్‌పై రూ.27 వంతున ధర పెంచిన చమురు కంపెనీలు
వాణిజ్య సిలిండర్ ధరలు పెంచుతూ సోమవారం చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు 2022 మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించాయి.
New Delhi, March 1: రష్యా - ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో గ్యాస్ ధరల పెంపు (LPG Cylinder Prices Hike) నిర్ణయాన్ని చమురు కంపెనీలు ప్రకటించాయి. వాణిజ్య సిలిండర్ ధరలు పెంచుతూ సోమవారం చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరలు 2022 మార్చి 1 నుంచి అమల్లోకి వస్తాయని ప్రకటించాయి.
చమురు కంపెనీలు. 19 కేజీల సిలిండర్ ధరపై రూ. 105లు (Commercial LPG Cylinder Prices Increased by Rs 105) , 5 కేజీల సిలిండర్‌పై రూ. 27 వంతున ధర పెంచాయి. దీంతో దేశ రాజధానిలో కమర్షియల్ సిలిండర్ ధర రెండు వేలు దాటింది. 19 కేజీ సిలిండర్ ధర రూ. 2,012కి చేరగా 5 కేజీల సిలిండర్ ధర రూ. 569గా ఉంది. పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకుని వివిధ నగరాల వారీగా 19 కేజీలు సిలిండర్ల ధరను పరిశీలిస్తే చెన్నైలో రూ. 2185, ముంబై రూ.1962 , కోల్‌కతా రూ.2089లు, హైదరాబాద్‌లో రూ.1904లుగా నమోదు అవుతున్నాయి.
సామాన్యుడికి మరో షాక్, భారీగా పెరిగిన అమూల్ పాల ధర, లీటరకు రెండు రూపాయలు పెంచుతున్నట్లు ప్రకటన
ఐదు రాష్ట్రాల ఎన్నికలు జరుగుతుండటంతో గృహ అవసరాలకు ఉపయోగించే సిలిండర్ ధరలు పెంచే సాహాసం చమురు కంపెనీలు చేయలేదు. దీంతో వీటి ధరల్లో ఎటువంటి మార్పులేదు. అయితే త్వరలోనే డొమెస్టిక్ సిలిండర్లకు ధరల వాత తప్పదనే ప్రచారం జరుగుతోంది.