Web Series On Rahul Failures: కాంగ్రెస్ పార్టీకి దిక్కు ప్రియాంక గాంధీనే, సోనియా గాంధీ పుత్ర వ్యామోహం, రాహుల్ గాంధీ వైఫల్యాల మీద వెబ్ సీరిస్, సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ జర్నలిస్ట్ పంకజ్ శంకర్
ఆ పార్టీ అధినేతగా పగ్గాలు రాహుల్ స్వీకరించినప్పటికీ అనుకున్నంతగా ముందుకు వెళ్లడం లేదు. అమిత్ షా, నరేంద్ర మోడీ వ్యూహాలను రాహుల్ గాంధీ ధీటుగా ఎదుర్కోలేకపోవడంతో చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారానికి దూరమయింది. కాగా కాంగ్రెస్ శ్రేణులు సైతం రాహుల్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి.
New Delhi,November 4: కాంగ్రెస్ పార్టీ గత నాలుగేళ్ల నుంచి రాజకీయాల్లో బీజేపీకి ధీటుగా నిలబడలేకపోతోంది. ఆ పార్టీ అధినేతగా పగ్గాలు రాహుల్ స్వీకరించినప్పటికీ అనుకున్నంతగా ముందుకు వెళ్లడం లేదు. అమిత్ షా, నరేంద్ర మోడీ వ్యూహాలను రాహుల్ గాంధీ ధీటుగా ఎదుర్కోలేకపోవడంతో చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీ అధికారానికి దూరమయింది. కాగా కాంగ్రెస్ శ్రేణులు సైతం రాహుల్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గతంలో కాంగ్రెస్ తో కలిసి పనిచేసిన మాజీ జర్నలిస్ట్ పంకజ్ శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ఇప్పుడు గట్టెక్కాలంటే వెంటనే ప్రియాంకా గాంధీకి పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని పిలుపునిచ్చారు. రాహుల్ పార్టీని సమర్థవంతంగా నడపలేడని తెలిపారు.
కాంగ్రెస్ పతనావస్థ, సోనియా పుత్ర వ్యామోహం, రాహుల్ వైఫల్యాలు, ప్రియాంక ఒక్కరే పార్టీకి దిక్కు, పునర్జన్మను ఇవ్వగలదు అనే కాన్సెప్ట్ మీద తన అభిప్రాయాలతో ఓ వెబ్ సీరిస్ రూపొందిస్తానని ఈ మాజీ జర్నలిస్ట్, గతంలో కాంగ్రెస్‌తో కలసి పని చేసిన పంకజ్ శంకర్ అన్నారు. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై విమర్శలు కురింపించారు.
రాహుల్ గాంధీపై పంకజ్ శంకర్ ట్వీట్
గతంలో ఈయన ప్రియాంకా గాంధీ మీడియా వ్యవహారాలను చూసేవారు. కాంగ్రెస్‌ను కష్టాల నుంచి ప్రియాంక గాంధీ మాత్రమే బయటపడేస్తారని ఎన్నికల సందర్భంగా చెప్పారు. అయితే సోనియా గాంధీ పుత్రప్రేమ వలన రాహుల్ గాంధీని ముందుకు తీసుకొచ్చారని అన్నారు. మూడు నెలల్లో ఈ సిరీస్ అందుబాటులోకి వస్తుందన్నారు.
అయితే పంకజ్ పబ్లిసిటీ కోసం ఈ వ్యాఖ్యలు చేసి ఉండొచ్చని కాంగ్రెస్ పేర్కొంది. సోనియా గాంధీ ప్రియాంక గాంధీల వద్ద పంకజ్ ఎలాంటి విధులు నిర్వహించలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్ దీప్ సూర్జేవాలా స్పష్టం చేశారు.