Bharat Bandh on September 27: సెప్టెంబర్ 27న భారత్ బంద్, రైతు సంఘాల పిలుపుకు మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, వివాదాస్పద వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్న రైతు సంఘాల నేతలు
కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 27న రైతు సంఘాలు పిలుపు ఇచ్చిన భారత్ బంద్‌కు (Bharat Bandh on September 27) మద్దతు ఇవ్వాలని (Congress to extend full support ) కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.
New Delhi, Sep 6: కేంద్రం తీసుకువచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 27న రైతు సంఘాలు పిలుపు ఇచ్చిన భారత్ బంద్‌కు (Bharat Bandh on September 27) మద్దతు ఇవ్వాలని (Congress to extend full support ) కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. సాగు చట్టాలకు నిరసనగా రైతులు చేపట్టిన నిరసనలకు (farmers' protest) కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తొలి నుంచీ మద్దతు ఇస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 27న కిసాన్ మహాపంచాయత్ ప్రతిపాదించిన భారత్ బంద్ విజయవంతమయ్యేందుకు బీజేపీయేతర పక్షాలన్నీ ప్రయత్నించాలని కాంగ్రెస్ ఇటీవల ఏర్పాటు చేసిన పోరాట కమిటీ నేత దిగ్విజయ్ సింగ్ కోరారు.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కేవలం కొద్దిమంది రైతులే (Farmers) ఆందోళన చేపడుతున్నారని కేంద్ర ప్రభుత్వం చెబుతోందని రైతులంతా సమైక్యంగా తమ గళం పార్లమెంట్‌కు వినిపించాలని యూపీలోని ముజఫర్‌నగర్‌లో ఆదివారం జరిగిన కిసాన్ మహాపంచాయత్ పిలుపు ఇచ్చింది. ఈ భేటీలో 15 రాష్ట్రాలకు చెందిన 300కు పైగా రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. రైతు ఉద్యమానికి అన్ని కులాలు, మతాలు, రాష్ట్రాలు, వర్గాలు మద్దతు పలుకుతున్నాయని కిసాన్ మహాపంచాయత్ నిరూపించిందని సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్‌కేఎం) వెల్లడించింది. సాగు చట్టాల రద్దు కోరుతూ యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేస్తామని అవసరమైతే 2024 లోక్‌సభ ఎన్నికల వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని ఎస్‌కేఎం స్పష్టం చేసింది.
ఇలాంటి సభలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తాం. దేశాన్ని అమ్మేయకుండా మనం కాపాడుకోవాలి. ఇదే ఈ సభ లక్ష్యం’ అని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) జాతీయ ప్రతినిధి రాకేశ్ టికాయిత్ అన్నారు. డిమాండ్లు పరిష్కరించేదాకా ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టంచేశారు. దేశవ్యాప్తంగా 300 సంఘాలకు చెందిన రైతులు సభకు హాజరయ్యారని బీకేయూ మీడియా ఇన్‌చార్జి ధర్మేంద్ర మాలిక్ తెలిపారు. వారికోసం 5 వేల ఫుడ్ స్టాల్స్‌ను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.
వివాదాస్పద కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల ఆందోళనకు అన్ని కులాలు, మతాలు, రాష్ర్టాలు, చిన్న వ్యాపారులు, సమాజంలోని అన్ని వర్గాల ప్రజల మద్దతు ఉందని ముజఫర్‌నగర్ సభ రుజువు చేసిందని 40 రైతు సంఘాల ఉమ్మడి వేదిక ఎస్కేఎం పేర్కొంది. 15 రాష్ట్రాల నుంచి రైతులు సభకు హాజరయ్యారని తెలిపింది.