Telangana: కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఉద్యోగాలు ఊడితేనే యువతకు ఉద్యోగాలు వచ్చాయి, గ్రూప్ -1 ఉద్యోగుల పాపం మీదేనని బీఆర్ఎస్ మీద మండిపడిన సీఎం రేవంత్ రెడ్డి
563 మంది గ్రూప్- 1 అధికారులను తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నాం. చిన్న ఆరోపణ లేకుండా టీజీపీఎస్సీ పని చేస్తోంది.
Hyd, Dec 2: హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లో నిర్వహించిన ప్రజా పాలన విజయోత్సవాల్లో(triumph of public governance) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సోమవారం పాల్గొన్నారు. ఈ సభలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఒక్క ఏడాదిలోనే ప్రజలకు ఉపయోగపడేలా అన్ని రంగాల్లో సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టామని అన్నారు. విద్యా, ఆరోగ్య రంగాలను బలోపేతం చేసేందుకు.. ఉపాధ్యాయ నియామకాలు చేపట్టామని, పాఠశాలల నిర్వహణ ఏజెన్సీలకు అప్పగించామని, ఆసుపత్రులలో పడకల సంఖ్య పెంచామని, వైద్య శాఖలో ఎన్నడూ లేనంతగా వైద్యుల, నర్సుల నియామకాలు పూర్తి చేశామని అన్నారు.
త్వరలోనే గ్రూప్-1 ఉద్యోగాల నియామకపత్రాలు అందజేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. 563 మంది గ్రూప్- 1 అధికారులను తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములను చేయబోతున్నాం. చిన్న ఆరోపణ లేకుండా టీజీపీఎస్సీ పని చేస్తోంది. దీన్ని రాజకీయ పునరావాసంగా మార్చదల్చుకోలేదు. అందుకే సీనియర్ ఐఏఎస్ బుర్రా వెంకటేశంను టీజీపీఎస్సీ ఛైర్మన్‌గా నియమించామని అన్నారు.
విభజనకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న పెండింగ్ అంశాలపై నేడు ఏపీ, తెలంగాణ అధికారుల భేటీ
రైతుల సంక్షేమం కోసం ఏకకాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ చేశామని, వచ్చే సంక్రాంతి తర్వాత రైతు భరోసా(Rythu Bharosa) నిధులు విడుదల చేస్తామని తెలిపారు. సన్నవడ్లు పండిస్తే రూ.500 బోనస్ ఇస్తామని ప్రకటించామని.. రానున్న పదేళ్ళ కాలంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుందని.. ఈ పదేళ్ళ కాలంలో బోనస్ కొనసాగిస్తామని ప్రకటించారు. ఎవ్వరు ఎంత భయపెట్టినా మీరు సన్నవడ్లు పండించడానికి వెనుకాడాల్సిన పని లేదని దైర్యం చెప్పారు. గత పాలకులు వరి వేస్తే ఉరి అన్నారని, కాని వారి పండిస్తే బోనస్ ఇస్తామని తాము అంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ఏడాది దేశంలోనే తెలంగాణ రికార్డ్ స్థాయిలో వరి ధాన్యాన్ని పండించిందని వెల్లడించారు.
ఉత్సవాలలో భాగంగా.. హైదరాబాద్ లోని ఎన్టీఆర్ మార్గ్ లో హెచ్ఎండీఏ గ్రౌండ్స్ లో 213 అంబులెన్స్ లకు సీఎం పచ్చజెండా ఊపి ప్రారంభించారు. అనంతరం 28 పారామెడికల్, 16 నర్సింగ్ కాలేజీలను, 33 మైత్రి ట్రాన్స్ జెండర్ల క్లినిక్స్ ను వర్చువల్ గా ప్రారంభించారు.ఏడాదిలోనే 14వేల మందిని వైద్య ఆరోగ్యశాఖలో నియమించడం ఒక చరిత్ర. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎనిమిది వైద్య కళాశాలలలు ఇచ్చి ఎలాంటి వసతులూ కల్పించలేదు. దేశంలోనే అత్యధిక డాక్టర్లను అందించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం.
గత పదేళ్ల పాలనను మీరు ప్రత్యక్షంగా చూశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యత విద్య, వైద్యం. 6500 మందిని వైద్యారోగ్యశాఖలో నియమించాలని నిర్ణయించాం. బీఆర్‌ఎస్ పాలనలో బీఆర్‌ఎస్ పాలనలో ఉద్యోగ నియామకాల్లేవు. ఉద్యోగ పరీక్షలు నిర్వహించినా.. పేపర్ లీక్‌ను అరికట్టలేకపోయారు’’ అని సీఎం విమర్శించారు.గతంలో ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితి ఉండేదికాదు. పేదలకు మెరుగైన వైద్యం అందించిన చరిత్ర కాంగ్రెస్‌ది. పేదల వైద్యానికి సీఎంఆర్ఎఫ్ ద్వారా 11 నెలల్లో రూ.830 కోట్లు ఖర్చు చేశాం’’ అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు ఉద్యోగాలు ఊడితేనే.. యువతకు ఉద్యోగాలు వచ్చాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 50వేలకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాం. కాంగ్రెస్ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తే.. పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని యువత నమ్ముతోందన్నారు.