Karnataka Job Quota Bill: వివాదంలో కర్ణాటక ప్రైవేట్ ఉద్యోగాల కోటా బిల్లు..వెనక్కి తగ్గిన సీఎం సిద్దూ!
కర్ణాటకలోని స్థానికులకే ప్రైవేట్ ఉద్యోగాలను రిజర్వ్ చేసే బిల్లుకు సిద్ధరామయ్య నేతృత్వంలోని మంత్రివర్గం స్టేట్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ లోకల్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ బిల్ 2024ను అమోదించింది. ఈ బిల్లును తీసుకురాబోతున్నామని సీఎం సిద్దరామయ్య ప్రకటన వెలువడిన వెంటనే ఆందోళన వ్యక్తం చేసిన పారిశ్రామిక వేత్తులు ఈ ప్రతిపాదిత బిల్లును బహిరంగంగానే వ్యతిరేకించారు.
Karnataka, July 18: కర్ణాటక సీఎం సిద్దరామయ్య చేసిన సంచలన ప్రకటన పారిశ్రామిక వర్గాల్లో గందరగోళానికి దారితీసింది. కర్ణాటకలోని స్థానికులకే ప్రైవేట్ ఉద్యోగాలను రిజర్వ్ చేసే బిల్లుకు సిద్ధరామయ్య నేతృత్వంలోని మంత్రివర్గం స్టేట్ ఎంప్లాయిమెంట్ ఆఫ్ లోకల్ ఇండస్ట్రీస్ ఫ్యాక్టరీస్ ఎస్టాబ్లిష్‌మెంట్ యాక్ట్ బిల్ 2024ను అమోదించింది. ఈ బిల్లును తీసుకురాబోతున్నామని సీఎం సిద్దరామయ్య ప్రకటన వెలువడిన వెంటనే ఆందోళన వ్యక్తం చేసిన పారిశ్రామిక వేత్తులు ఈ ప్రతిపాదిత బిల్లును బహిరంగంగానే వ్యతిరేకించారు.
అయితే ప్రభుత్వం మాత్రం కర్ణాటక ప్రజలకు మేలు చేసేందుకే ఈ బిల్లు తీసుకొచ్చామని చెబుతున్నారు. ప్రభుత్వం తీసుకురావలనుకుంటున్న ఈ బిల్లు ప్రకారం ..ప్రభుత్వం అందించిన మౌలిక సదుపాయాలను వాడుకుంటున్న కంపెనీలు స్థానికులకు ఉద్యోగాలను రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. సరోజిని మహిషి కమిటీ చేసిన సిఫార్సులకు అనుగుణంగా ఈ బిల్లును తయారు చేశారు. 50 మంది కంటే ఎక్కువ కార్మికులతో పనిచేసే పారిశ్రామిక యూనిట్లలో గ్రూప్ A ఉద్యోగాల్లో 65 శాతం, గ్రూప్ ఉద్యోగాల్లో 80 శాతం కన్నడిగులకు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది .అంతేగాదు గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగాలన్నీ కన్నడిగులకే ఇవ్వాలని సిఫార్స్ చేసింది. ఇదే సిఫారసును బిల్లు రూపంలో తీసుకురావాలని సిద్దరామయ్య సర్కార్ నిర్ణయించింది. అంతేగాదు కేబినెట్ ఈ బిల్లుకు అమోదం తెలిపింది కూడా.
ఐటీ హబ్‌గా ఉన్న బెంగళూరులో ఈ బిల్లు తీసుకువస్తే కంపెనీలు తీవ్ర నష్టపోతాయని పలువురు చెబుతున్నారు. ఎందుకంటే నైపుణ్యం, ప్రతిభ కలిగిన వారికి ఉద్యోగం రాకపోతే కంపెనీలు నష్టపోతాయని చెబుతున్నారు. ఈ బిల్లు అమలైతే బెంగళూరులోని ఐటీ పరిశ్రమ కుప్పకూలడం ఖాయమని...పరిశ్రమలు తరలిపోవడం ఖాయమని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో తిరుగులేని మెజార్టీతో టీడీపీ - జనసేన - వైసీపీ - బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇక కూటమి గెలుపులో కీలకపాత్ర పోషించారు పవన్. అందుకే చంద్రబాబు తన కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా పవన్‌కు అవకాశం కల్పించడమే కాదు మరో ఇద్దరికి మంత్రులుగా అవకాశం ఇచ్చారు.
స్థానిక నియామకాల కోసం ప్రైవేట్ ఉద్యోగాలను రిజర్వ్ చేయాలనే ప్రతిపాదనను ఫార్మాస్యూటికల్ దిగ్గజం బయోకాన్ వ్యవస్థాపకుడు కిరణ్ మజుందార్-షా బహిరంగంగానే వ్యతిరేకించారు. స్థానికులకు ఉద్యోగ రిజర్వేషన్లు అంశం సాంకేతిక రంగంలో అగ్రగామిగా ఉన్న కర్ణాటకపై ప్రభావితం చేయకూడదని అభిప్రాయపపడ్డారు. స్థానికులకు ఉపాధి కల్పించాలనే విషయంలో రాజీపడబోమని...ఇదే సమయంలో టెక్నాలజీ రంగంలో ముందంజలో ఉన్న బెంగళూరుకు ఈ బిల్లు ఎటువంటి నష్టం జరగకుండా చూసుకోవాలని సూచించారు.
దీనిపై కాంగ్రెస్ నేతలు ఈ బిల్లు ఇంకా అమల్లోకి రాలేదని అందరిని సంప్రదించిన తర్వాత వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని బిల్లును రూపొందిస్తామని తెలిపారు. ఇప్పటినుండే ఎలాంటి భయాలు పెట్టుకోవద్దని సూచించారు. దేశాన్ని ఆర్థికాభివృద్ధిలో కర్ణాటక ఎప్పుడూ ముందుండి నడిపిస్తోందని, దానిని కొనసాగిస్తున్నామని తెలిపారు కాంగ్రెస్ నేతలు. అయితే ప్రైవేట్ కంపెనీల్లో కిందిస్థాయి ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు అంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టును సీఎం సిద్ధరామయ్య డిలీట్ చేశారు. పారిశ్రామిక వేత్తల నుండి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఈ బిల్లుపై కాంగ్రెస్ సర్కార్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.