సినిమా స్టైల్ లో ఛేజింగ్! నిందితుడి కోసం ఏకంగా ఆస్పత్రిలోకి జీపు వేసుకెళ్లిన పోలీసులు, డాక్టర్ లైంగికంగా వేధించిన వ్యక్తి అరెస్ట్ (వీడియో ఇదుగోండి)
నాలుగో అంతస్తులో ఉన్న వార్డు వరకు వాహనాన్ని తీసుకెళ్లారు. ఆ నిందితుడిని అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో ఈ తరహా సాహసం చేశారు. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. మే 19వ తేదీన ఓ మహిళా డాక్టర్‌ను.. నర్సింగ్ ఆఫీసర్ వేధించినట్లు తెలుస్తోంది.
Rishikesh, May 23: ఉత్తరాఖండ్ పోలీసులు సినీ ఫక్కీలో .. రిషికేశ్‌లోని ఏయిమ్స్ ఆస్పత్రిలోకి ఎంట్రీ ఇచ్చారు. ఓ నిందితుడిని పట్టుకునేందుకు.. ఏకంగా పోలీసు జీప్(Police Jeep)తో ఎమర్జెన్నీ వార్డులోకి వెళ్లారు. స్ట్రెచ్చర్లపై ఉన్న పేషెంట్లను పక్కకు జరుపుతూ.. నాలుగో అంతస్తులో ఉన్న వార్డు వరకు వాహనాన్ని తీసుకెళ్లారు. ఆ నిందితుడిని అరెస్టు చేయాలన్న ఉద్దేశంతో ఈ తరహా సాహసం చేశారు. ఈ ఘటనకు చెందిన వీడియో ఒకటి వైరల్ అవుతున్నది. మే 19వ తేదీన ఓ మహిళా డాక్టర్‌ను.. నర్సింగ్ ఆఫీసర్ వేధించినట్లు తెలుస్తోంది. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అతన్ని పట్టుకునేందుకు హాస్పిటల్‌కు వచ్చారు. నిందితుడు సతీశ్ కుమార్.. రాజస్థాన్‌కు చెందిన వాడు. ఆస్పత్రి థియేటర్‌లో డాక్టర్ ని వేధించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ ఘటనలో అతన్ని సస్పెండ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. లైంగిక వేధింపుల ఆరోపణల కింద సతీశ్ కుమార్‌ను అరెస్టు చేశారు. 354, 506 సెక్షన్ల కింద కేసు బుక్ చేశారు.
పోలీసు వాహనం హాస్పిటల్ గ్యాలరీలోకి వెళ్లడం పట్ల డెహ్రాడూన్ ఎస్ఎస్పీ క్లారిటీ ఇచ్చారు. ఈ ఘటన పట్ల విచారణ చేపడుతున్నట్లు ఆయన వెల్లడించారు. వీడియోలో ఉన్నది ఎమర్జెన్సీ వార్డు కాదు అని, అది వెయిటింగ్ గ్యాలరీ అని పోలీసు ఆఫీసర్ తెలిపారు.