Coronavirus Outbreak in India: మహారాష్ట్రలో 100 దాటిన కరోనావైరస్ కేసులు, దేశవ్యాప్తంగా 492 కేసులు నమోదు, 9 మరణాలు సంభవించినట్లు అధికారిక గణాంకాలు ప్రకటించిన కేంద్ర ఆరోగ్య శాఖ

అయితే కేంద్రం ప్రకటించిన గణాంకాలకు, రాష్ట్రాలలో నమోదైన కేసులకు కొంత వ్యత్యాసం ఉంటుంది. ఈ వివరాలన్నింటినీ ఆయా రాష్ట్రాలు, యూటీలు కేంద్రానికి రిపోర్ట్ చేసిన తర్వాత వెల్లడించినవి. తాజాగా మరికొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 101కి చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.....

Coronavirus scanning (Photo Credit: PTI)

New Delhi, March 24: భారతదేశంలో కరోనావైరస్ వేగంగా విస్తరిస్తోంది, మార్చి 24 మంగళవారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య (COVID 19 in India) 492కి చేరినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ధృవీకరించింది, కేరళలో (Kerala) ఒక్కసారిగా కరోనావైరస్ కేసులు 98కి పెరిగాయి ఆ తర్వాత మహారాష్ట్రలో (Maharashtra) అత్యధికంగా 89 నమోదయ్యాయి. దేశంలో కరోనావైరస్ ప్రభావంతో మరణించిన వారి సంఖ్య 9 కి చేరుకుంది. ఇందులో మహారాష్ట్ర నుంచి రెండు మరణాలు నమోదవగా, బీహార్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, దిల్లీ, గుజరాత్ మరియు పంజాబ్ రాష్ట్రాల నుంచి ఒక్కో మరణం నమోదైంది.

దేశవ్యాప్తంగా 37 మంది కరోనా బాధితులు కోలుకున్నట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీని ప్రకారం ఇప్పుడు దేశంలో 446 మంది కరోనావైరస్ బాధితులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక ఇటీవల యూటీలుగా ఏర్పడిన లడఖ్ మరియు జమ్మూకాశ్మీర్ ల నుంచి వరుసగా 13 మరియు 4 కేసులు నమోదయ్యాయి. దేశంలో నమోదైన మొత్తం కరోనావైరస్ పాజిటివ్ కేసుల్లో 41 మంది విదేశీయులు కూడా ఉన్నారు.

Take a Look at the State-wise Coronavirus Tally:

S. No. Name of State / UT Total Confirmed cases (Indians) Total Confirmed cases (Foreigners) Cured/

Discharged/Migrated

Death
1 Andhra Pradesh 7 0 0 0
2 Bihar 2 0 0 1
3 Chhattisgarh 1 0 0 0
4 Delhi 30 1 6 1
5 Gujarat 29 0 0 1
6 Haryana 12 14 11 0
7 Himachal Pradesh 3 0 0 1
8 Karnataka 37 0 2 1
9 Kerala 87 8 4 0
10 Madhya Pradesh 7 0 0 0
11 Maharashtra 84 3 0 2
12 Odisha 2 0 0 0
13 Puducherry 1 0 0 0
14 Punjab 21 0 0 1
15 Rajasthan 31 2 3 0
16 Tamil Nadu 10 2 1 0
17 Telangana 22 10 1 0
18 Chandigarh 6 0 0 0
19 Jammu and Kashmir 4 0 0 0
20 Ladakh 13 0 0 0
21 Uttar Pradesh 32 1 9 0
22 Uttarakhand 3 0 0 0
23 West Bengal 7 0 0 1
Total confirmed cases in India 451 41 37 9

అయితే కేంద్రం ప్రకటించిన గణాంకాలకు, రాష్ట్రాలలో నమోదైన కేసులకు కొంత వ్యత్యాసం ఉంటుంది. ఈ వివరాలన్నింటినీ ఆయా రాష్ట్రాలు, యూటీలు కేంద్రానికి రిపోర్ట్ చేసిన తర్వాత వెల్లడించినవి. తాజాగా మరికొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 101కి చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కరోనావైరస్ ఎఫెక్ట్, మార్చి 24 అర్ధరాత్రి నుంచి అన్ని దేశీయ విమాన సర్వీసులు రద్దు

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో ఇప్పటివరకు 33 కేసులు నమోదు కాగా, ఆంధ్రప్రదేశ్ లో 7 కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే ఈ రెండు రాష్ట్రాలలో మార్చ్ 31 వరకు లాక్ డౌన్ కొనసాగుతుంది.

మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 192 దేశాలలో మార్చి 23 నాటికి కరోనావైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 3 లక్షల 36 వేలు దాటింది. ఇందులో సుమారు 2 లక్షల 50 వేల కేసులు చైనా వెలుపల నమోదైనవే. కరోనావైరస్ వ్యాప్తి నేపథ్యంలో 2020 ఒలంపిక్స్ క్రీడలు వాయిదాపడ్డాయి.

(Social media brings you the latest breaking news, viral news from the world of social media including Twitter, Instagram and YouTube. The above post is embedded directly from the user's social media account. This body of content has not been edited or may not be edited by Latestly staff. Opinions appearing on social media posts and the facts do not reflect the opinions of Latestly, and Latestly assumes no responsibility for the same.)

Share Now

Share Now