Coronavirus Cases in India: దేశంలో 1,37,139కు చేరిన కోవిడ్ మరణాల సంఖ్య, తాజాగా 443 మంది మృతి, 94 లక్షల 31 వేలకు చేరిన మొత్తం కరోనా కేసులు, కోవిడ్‌తో బీజేపీ ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కన్నుమూత

443 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు భారత్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 94 లక్షల 31 వేలకు చేరుకుంది. కోవిడ్‌ మరణాల సంఖ్య 1,37,139 దాటింది. ఇక ప్రస్తుతం దేశంలో 4,46,952 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

Coronavirus | Representational Image | (Photo Credits: PTI)

New Delhi, November 30: భారత్‌లో గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 38,772 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు (Coronavirus Cases in India) వెలుగుచూశాయి. 443 మంది కరోనాతో మృత్యువాత పడ్డారు. దీంతో ఇప్పటివరకు భారత్‌లో నమోదైన కరోనా కేసుల సంఖ్య 94 లక్షల 31 వేలకు చేరుకుంది. కోవిడ్‌ మరణాల సంఖ్య 1,37,139 దాటింది. ఇక ప్రస్తుతం దేశంలో 4,46,952 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

గత 24 గంటల్లో 45,333 మంది కోవిడ్‌ బాధితులు మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కరోనాను జయించిన వారి సంఖ్య మొత్తంగా 88,47,600కు (Coronavirus Outbreak in India) చేరింది. ఇక దేశవ్యాప్తంగా కరోనా రికవరీ రేటు 93.81గా ఉంది. నమోదైన మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల శాతం 4.74 శాతంగా ఉంది. మరణాల రేటు 1.45శాతానికి తగ్గింది. ఈ మేరకు సోమవారం కేంద్ర, వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది.

కరోనావైరస్‌తో బీజేపీ ఎమ్మెల్యే కన్నుమూశారు. రాజస్థాన్ రాష్ట్ర బీజేపీ మహిళా ఎమ్మెల్యే కిరణ్ మహేశ్వరి కరోనాతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్దరాత్రి మరణించారు.

కరోనా వ్యాక్సిన్‌పై శుభవార్త, 2021 ప్రారంభంలో వస్తుందని, 30 కోట్ల మందికి టీకాలు వేస్తామని తెలిపిన కేంద్ర మంత్రి హర్షవర్థన్, ఫైజర్ వ్యాక్సిర్ అవసరం లేదని తెలిపిన ఆరోగ్య శాఖ మంత్రి

బీజేపీ ఎమ్మెల్యే అయిన కిరణ్ మహేశ్వరికి కొవిడ్-19 పాజిటివ్ అని పరీక్షల్లో తేలడంతో ఆమె గురుగ్రామ్ లోని మేదాంత ఆసుపత్రిలో చేరారు. మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం అర్దరాత్రి కన్నుమూశారు. మహేశ్వరి గతంలో రాజస్థాన్ రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. గతంలో ఈమె బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, జాతీయ పార్టీ ఉపాధ్యక్షురాలిగా, బీజేపీ మహిళా విభాగం అధ్యక్షురాలిగా సేవలందించారు. మహేశ్వరి మృతి పట్ల బీజేపీ నేతలు తమ ప్రగాఢ సంతాపం తెలిపారు.



సంబంధిత వార్తలు

Lower Risk Of Diabetes For Faster walkers: వేగంగా నడిస్తే తగ్గనున్న మధుమేహ ముప్పు.. హైబీపీ, గుండె సంబంధిత వ్యాధులూ తగ్గే అవకాశం.. తాజా అధ్యయనంలో వెల్లడి

Telangana Student Dies In US: అమెరికాలో మ‌రో తెలంగాణ విద్యార్థి అనుమానాస్ప‌ద మృతి.. కారులో శ‌వ‌మై క‌నిపించిన యువకుడు.. బాధితుడు హ‌నుమ‌కొండ జిల్లా వాసి బండి వంశీగా గుర్తింపు

Smuggler Arrested in Pushpa 2 Theatre: పుష్ప -2 సినిమా చూస్తూ అడ్డంగా బుక్క‌యిన‌ మోస్ట్ వాటెండ్ స్మ‌గ్ల‌ర్, సినీ ఫ‌క్కీలో థియేట‌ర్లోకి ఎంట్రీ ఇచ్చిన పోలీసులు, ఆ త‌ర్వాత ఏమైందంటే?

Police Angry On Allu Arjun: సినిమా వాళ్ళ బట్టలు ఊడతీస్తాం..అల్లు అర్జున్ ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. లేదంటే తోలు తీస్తాం అని హెచ్చరించిన ఏసీపీ సబ్బతి విష్ణు మూర్తి

00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif