COVID in India: భారీగా పెరుగుతున్న కేసులు, అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక, కొత్తగా 6050 మందికి కరోనా పాజిటివ్‌

దాంతో దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 28 వేల మార్క్‌ను దాటింది. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమై కరోనా మహమ్మారి కట్టడికి ఉపక్రమించింది.

Mansukh Mandaviya (Photo-ANI)

New Delhi, April 7:  కేవలం 24 గంటల వ్యవధిలో కొత్తగా 6050 మందికి కోరోనా పాజిటివ్‌ వచ్చింది. దాంతో దేశంలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 28 వేల మార్క్‌ను దాటింది. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమై కరోనా మహమ్మారి కట్టడికి ఉపక్రమించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖమంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా(Union Health Minister Dr Mansukh Mandaviya ) కోవిడ్ కేసులు, నిర్వహణ చర్యలపై వివిధ రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు(States Health Ministers), ప్రిన్సిపల్ సెక్రటరీ(Principal secretaries)లతో ఆన్‌లైన్ నిర్వహించారు.

దేశంలో కరోనా కేసులు పెరగడానికి XBB1.16 వేరియంటే కారణం, దీని లక్షణాలు తెలుసుకుని జాగ్రత్తగా ఉండాలని చెబుతున్న నిపుణులు

దేశంలో కోవిడ్ కేసులు(Covid Cases) పెరుగుతున్న దృష్ట్యా రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా కేసులు పెరగకుండా అడ్డుకునేందుకు తగిన చర్యలు చేపట్టాలని కోరారు. ఇందులో భాగంగా ఏప్రిల్ 10, 11 తేదీల్లో అన్ని హాస్పిటల్స్‌లో సన్నాహక చర్యలు చేపట్టాలని కోరారు. ఈ నెల8,9 తేదీల్లో జిల్లా ఉన్నతాధికారులు, ఆరోగ్యశాఖ అధికారులతో కోవిడ్ చర్యలపై సమీక్షించాలని ఆరోగ్య మంత్రులను కోరారు. సమావేశం ముగిసిన తర్వాత కేంద్రం కొవిడ్‌పై నూతన మార్గదర్శకాలను విడుదల చేసే అవకాశం ఉంది.