Tamil Nadu Raj Bhavan: తమిళనాడు రాజ్‌భవన్‌లో కరోనా కల్లోలం, 84 మంది సిబ్బందికి కోవిడ్-19 పాజిటివ్, తమిళనాడులో లక్షా 90 వేలకు చేరువలో కరోనా కేసులు
అక్కడ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారం ఒక్కరోజే ఆరు వేలకు సమీపంగా చేరింది. తాజగా గురవారం రాజ్‌భవన్‌లో (Tamil Nadu Raj Bhavan) 84 మంది సిబ్బందికి కరోనా పాటిజిట్‌గా నిర్ధారణ అయింది. 147 మంది సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 84 మందికి కరోనా పాజిటివ్‌గా (84 staff members test positive) తేలింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో సెక్యూరిటీ, ఫైర్ సిబ్బంది ఉన్నారు. ఈ మేరకు రాజ్‌భవన్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు.
Chennai, July 23: తమిళనాడులో కరోనా వైరస్ విజృంభిస్తోంది. అక్కడ రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య బుధవారం ఒక్కరోజే ఆరు వేలకు సమీపంగా చేరింది. తాజగా గురవారం రాజ్‌భవన్‌లో (Tamil Nadu Raj Bhavan) 84 మంది సిబ్బందికి కరోనా పాటిజిట్‌గా నిర్ధారణ అయింది. 147 మంది సిబ్బందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 84 మందికి కరోనా పాజిటివ్‌గా (84 staff members test positive) తేలింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వారిలో సెక్యూరిటీ, ఫైర్ సిబ్బంది ఉన్నారు. ఈ మేరకు రాజ్‌భవన్ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. భారత్‌లో 18 కోట్ల మందికి కరోనా భయమే లేదు, వారి శరీరం కోవిడ్-19 రోగనిరోధక శక్తిని కలిగి ఉంది, థైరోకేర్ సర్వేలో వెల్లడి
అయితే కరోనా బారినపడ్డవారెవరూ కూడా గవర్నర్, ఉన్నతాధికారులతో కాంటాక్ట్ కాలేదని రాజ్‌భవన్ అధికారులు తెలిపారు. బాధితులందరినీ ఆరోగ్యశాఖ అధికారులు హోం క్వారంటైన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ముందుజాగ్రత్త చర్యగా రాజ్‌భవన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో క్రిమిసంహారక రసాయనాలతో స్ర్పే చేశారు. నెగిటివ్ వచ్చిన 12 మందికి మళ్లీ పాజిటివ్, మధ్యప్రదేశ్ గవర్నరు అంత్యక్రియల్లో పాల్గొన్న మంత్రికి కరోనా, మణిపూర్‌లో మళ్లీ పూర్తిస్థాయి లాక్ డౌన్, దేశంలో 12 లక్షల దాటిన కోవిడ్-19 కేసులు
బుధవారం నిర్థారణ అయిన కరోనా పాజిటివ్ కేసుల జాబితాలో మరో ఎమ్మెల్యే చేరిపోయారు. దీంతో కరోనా బారినపడిన నలుగురు మంత్రులతో కలుపుకొని ఎమ్యెల సంఖ్య 17కు చేరుకుంది. రాష్ట్రం లో మొత్తం కరోనా కేసులు సంఖ్య (Coronavirus in Tamil Nadu) 186492 కేసలు నమోదు కాగా, 51765 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇప్పటికే 131583 మంది కరోనా నుంచి డిశ్చార్జ్ కాగా, 3144 మంది మృతి చెందారు. ఇక బుధవారం ఒక్కరోజే ఏకంగా 5849 కేసుల నమోదయ్యాయి.