Coronavirus Second Wave: సెకండ్ వేవ్‌లో యూత్‌ని టార్గెట్ చేసిన కరోనా, 20-39 సంవత్సరాల వయస్సు వారిపై అధికంగా కోవిడ్ వైరస్ ప్రభావం, అజాగ్రత్తగా ఉంటే మొదటి వేవ్ కన్నా ఎక్కువ మరణాలు సంభవిస్తాయంటున్న బెంగుళూరు వైద్యులు
మార్చి మధ్యలో కేసులు పెరగడం మొదలుపెట్టినప్పటి నుండి (Coronavirus Second Wave) కర్ణాటక రాజధాని బెంగుళూరులో అత్యధికంగా 20-39 సంవత్సరాల వయస్సు గలవారు కరోనా బారీన పడ్డారు. ఈ విషయాన్ని అక్కడి వైద్యులు తెలిపారు. మొదటి వేవ్‌లో (Covid First Wave) వృద్ధులపై ప్రభావం చూపగా.. ఇప్పుడు పెద్దగా వారిలో తీవ్రత కనిపించడం లేదని బెంగళూరు వైద్యులు (Bengaluru Doctors) గుర్తించారు.
Bengaluru, Mar 30: దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ కల్లోలం రేపుతోంది. మార్చి మధ్యలో కేసులు పెరగడం మొదలుపెట్టినప్పటి నుండి (Coronavirus Second Wave) కర్ణాటక రాజధాని బెంగుళూరులో అత్యధికంగా 20-39 సంవత్సరాల వయస్సు గలవారు కరోనా బారీన పడ్డారు. ఈ విషయాన్ని అక్కడి వైద్యులు తెలిపారు. మొదటి వేవ్‌లో (Covid First Wave) వృద్ధులపై ప్రభావం చూపగా.. ఇప్పుడు పెద్దగా వారిలో తీవ్రత కనిపించడం లేదని బెంగళూరు వైద్యులు (Bengaluru Doctors) గుర్తించారు.
మార్చి మధ్య నాటి నుంచి కరోనా కేసులు (Coronavirus New Wave) పెరిగిన నాటి నుంచి బెంగళూరులో వైరస్ పాజిటివ్‌గా పరీక్షించిన వారిలో 20-39 మధ్య వయస్సున వ్యక్తులే ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. ఈ నెల 17 నుంచి 26వ తేదీల మధ్య 20-29 సంవత్సరాల వయస్సున్న వారు 2,408 మంది, 30-39 సంవత్సరాల వయస్సున 2,547 మంది వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షించినట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలికే డేటా పేర్కొంది. 60-69 మధ్య 1,178 మంది, 70 ఏళ్లు పైబడిన వారిలో 828 మంది వైరస్ బారినపడ్డారు. వైరస్ ట్రాన్‌మిసిబిలిటీ పెరగడం, ప్రజల ప్రవర్తనే ఈ పరిస్థితికి దారి తీసిందని వైద్యులు పేర్కొంటున్నారు.
డాక్టర్ బ్రుండా మాట్లాడుతూ 35-40 ఏళ్ళ వయస్సులో చాలా మంది ప్రజలకు వైరస్ సోకినట్లు తెలిపారు. ఇందులో ఎక్కువగా జలుబు, జ్వరం, దగ్గు మొదలైన లక్షణాలతో కేసులు వస్తున్నాయని, మొదటి వేవ్‌తో పోలిస్తే ప్రసార రేటు ఎక్కువని, లాక్‌డౌన్‌తో వైరస్ వ్యాప్తిని పరిమితం చేసిందని పేర్కొన్నారు. అయితే సెకండ్ వేవ్‌లో టీకా అందుబాటులోకి రావడంతో ప్రజల కదలిక ఎక్కువై.. ప్రసార రేటు పెరిగిందని చెప్పారు.
టీకాలు వేయడంతో వృద్ధుల్లో సంక్రమణ రేటు తగ్గిపోవచ్చునని.. కానీ, చాలా మంది మధ్య వయస్సులు వైరస్ బారినపడుతున్నట్లు చూస్తున్నందున టీకా వేసేందుకు 35 సంవత్సరాలకు తగ్గించడాన్ని కేంద్రం ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు. జయానగర్‌లోని మణిపాల్ హాస్పిటల్ ఇంటర్నల్ మెడిసన్ కన్సల్టెంట్ డాక్టర్ అరవింద జీఎం మాట్లాడుతూ 20-30 మధ్య వయస్సుల్లో 10 నుంచి 20శాతం పెరుగుదల అంచనా వేశారని, ఇందులో చాలా మందికి జీర్ణాశయాంతరలక్షణాలున్నాయని పేర్కొన్నారు. కేసులు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
అయితే మొదటి వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ చాలా ప్రమాదకరమని చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణం మొదటి వేవ్‌లో లాక్‌డౌన్ విధించడం వల్ల వ్యాప్తి ఎక్కవగా జరగలేదు. అయితే సెకండ్‌వేవ్‌లో లాక్డౌన్ వంటివి ఉండకపోవడంతో కేసులు విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని వారు చెబుతున్నారు. దీని వల్లే కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని వారు అంటున్నారు.
జయానగర్‌లోని మణిపాల్ హాస్పిటల్లోని ఇంటర్నల్ మెడిసిన్ కన్సల్టెంట్ డాక్టర్ అరవింద జి ఎమ్, 20-30 సంవత్సరాల వయస్సు గల రోగులలో 10-20% పెరుగుదల అంచనా వేశారు.“చాలామందికి జీర్ణశయాంతర లక్షణాలు ఉన్నాయి. కేసులు పెరుగుతున్నందున ప్రజలు జాగ్రత్తగా ఉండడం ప్రారంభించాలి. సంక్రమణ వ్యాప్తి కూడా ఎక్కువ, ”అని ఆయన అన్నారు.
యశ్వంత్‌పూర్‌లోని కొలంబియా ఆసియా రెఫరల్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ప్రదీప్ రంగప్ప మాట్లాడుతూ.. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా హాస్పిటళ్లలో చేరే వారి సంఖ్య తక్కువగా ఉందని, కానీ రాబోయే కొద్ది వారాల్లో ఐసీయూ, హాస్పిటల్‌కు వచ్చే వారి సంఖ్య పెరిగే అవకాశాలున్నాయన్నారు. మొదటి వేవ్‌లో చూసిన విధంగానే మరణాలు చూడాల్సి వస్తుందని.. అలాంటి దశలోకి వెళ్లకుండా చూసుకోవాలన్నారు.
ఐసీయూ పడకలు పెంచడం ప్రారంభించాలని, టీకాలు అందుబాటులో ఉంచాలన్నారు. చాలా ఆసుపత్రులు కొవిడ్ రోగులను అనుమతించడం లేదని, కేంద్రీకృత మేనేజ్‌మెంట్ వ్యవస్థను ప్రభుత్వం తిరిగి అమలులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని డాక్టర్ రంగప్ప అభిప్రాయపడ్డారు. సెకండ్ వేవ్ లో కరోనా చాలా డేంజరని మొదటి వేవ్ మాదిరిగానే మరణాలు చాలా ఎక్కువగా సంభవించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అవసరం ఉంది ”అని డాక్టర్ రంగప్ప అన్నారు.
సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 2,792 పాజిటివ్ కేసులు వెలుగుచూశాయి. అదే సమయంలో 1,964 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. గత రెండునెలల్లో ఎన్నడూ లేని రీతిలో 16 మందిని కరోనా పొట్టనబెట్టుకుంది. తాజాగా రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 9,89,804కు పెరిగింది. 9,53,416 మంది కోలుకున్నారు. 12,520 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 23,849 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అందులో 227 మంది రోగులు ఐసీయూలో ఉన్నారు. బెంగళూరులో 1,742 కేసులు
సిలికాన్‌సిటీలో కొత్తగా 1,742 పాజిటివ్ కేసులు తేలాయి. 1,356 మంది కోలుకున్నారు. 9 మరణాలు నమోదయ్యాయి. బెంగళూరులో మొత్తం కేసుల సంఖ్య 4,29,915కు పెరగ్గా, అందులో 4,09,065 మంది బతికి బయటపడ్డారు. మరో 4,590 మంది చనిపోయారు. ప్రస్తుతం 16,259 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం 87,197 మందికి కోవిడ్ పరీక్షలు చేశారు. ఇప్పటి వరకు చేసిన కరోనా పరీక్షల సంఖ్య 2,11,95,741కు చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా 56,374 మందికి కరోనా టీకా వేశారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 34,80,930 మంది వ్యాక్సిన్ పొందారు.
రాష్ట్రంలో లాక్‌డౌన్, కంటైన్మెంట్ జోన్‌లు, కరోనా ఆంక్షలు తదితరాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు రెవెన్యూ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ మాత్రమే ఆదేశాలు జారీ చేస్తాయి. ఇతరులు ఎవరూ మాట్లాడవద్దు అని సీఎం యడియూరప్ప ఇతర శాఖలకు స్పష్టంచేశారు. ఏ అధికారి, మంత్రి, ప్రజాప్రతినిధి కానీ బహిరంగ వ్యాఖ్యలు చేయరాదని సూచించారు.