Guntur, Mar 30: ఏపీలో కరోనావైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరూ మాస్కులు ధరించాలని పోలీసులు సూచిస్తున్నారు. మాస్కులు ధరించకుంటే రూ. 2 వేల వరకు జరిమానా విధిస్తున్నారు. తాజాగా గుంటూరులో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. గుంటూరు అర్బన్ పరిధిలో లాడ్జికూడలి, ఎంటీబీ కూడలిలో మాస్కు ధరించని వారిపై ఎస్పీ అమ్మిరెడ్డి (Urban SP RN Ammi Reddy) ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఈ లాడ్జి కూడలిలో తుళ్లూరు ట్రాఫిక్ సీఐ మల్లికార్జునరావు (Thullur Traffic CI Mallikarjuna Rao) మాస్కు ధరించకుండా అటుగా వెళ్లడం ఎస్పీ గుర్తించారు.
వేంటనే సీఐని ఆగమని కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అందరూ తప్పని సరిగా (Covid-19 regulations) మాస్క్ ధరించాలి మీరు ఎందుకు మాస్క్ ధరించలే అని ప్రశ్నించగా సీఐ హడావిడిలో మర్చిపోయాను సార్ అనిచెప్పారు. దీంతో తుళ్లూరు ట్రాఫిక్ సీఐ మల్లి మల్లికార్జునరావుకు ఎస్పీ అమ్మిరెడ్డి జరిమానా (Guntur police fine its own traffic CI) విధించి, స్వయంగా మాస్కు తొడిగారు. కరోనా వైరస్ ఉద్ధృతంగా వ్యాప్తి చెందుతున్న క్రమంలో పోలీసులు సైతం జాగ్రత్తగా ఉండాలని ఎస్పీ సూచించారు.
ఒక్కరోజే మాస్కులు ధరించని వారి నుంచి రూ.17.34 లక్షలు వసూలు
మాస్కు ధరించని కారణంగా సీఐకి అపరాధ రుసుం(ఫైన్) విధించాలని అధికారులను ఆదేశించారు. అంతేకాదు ఎస్పీ స్వయంగా మాస్కు తెప్పించి సీఐకి తగిలించారు. అలాగే వాహనదారులను ఆపి, మాస్క్ ధరించకుండా రోడ్లపైకి రావొద్దని హెచ్చరించారు. మాస్కులు ధరించిన వారినే అనుమతించాలంటూ సమీపంలోని దుకాణదారులకు సూచించారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఎస్పీ సూచించారు.
GUNTUR POLICE Tweets
గుంటూరు రేంజ్ డిఐజి గారు గుంటూరు అర్బన్ శంకర్ విలాస్ సెంటర్ నందు మాస్క్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్క్ ధరించని వారికి గుంటూరు రేంజ్ డిఐజి గారు మాస్కులు అందజేశారు. రాకపోకలు జరిపే ప్రజలు మాస్క్ ధరించి అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.@APPOLICE100 pic.twitter.com/4ea2wdWSri
— GUNTUR URBAN POLICE (@spguntururban) March 29, 2021
కరోనాపై నరసరావుపేటలో పోలీసుల అవగాహన సదస్సులో పాల్గొన్న గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ శ్రీ విశాల్ గున్ని IPS., గారు, మాస్కు ధరించని వాహనదారులకు అవగాహన కల్పించి, వారికి మాస్కులు అందించిన SP గారు.@APPOLICE100@dgpapofficial pic.twitter.com/SCLKBvcKVU
— GUNTUR RURAL DISTRICT POLICE (@GntRuralPolice) March 29, 2021
ఇక గుంటూరు జిల్లాలో పోలీసులు కరోనావైరస్ పై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా రూరల్ ఎస్పీ శ్రీ విశాల్ గున్ని మాస్కు ధరించని వాహనదారులకు అవగాహన కల్పించి, వారికి మాస్కులు అందిస్తున్నారు. వాహన దారులకు ఫైన్ విధిస్తు, వారికి మాస్కులు అందజేస్తున్నారు.