#SundaySamvaad: ఫిబ్రవరిలో కరోనాకు విరుగుడు, వచ్చే తొలి వ్యాక్సిన్ నేనే తీసుకుంటా, సండే సంవాద్ కార్యక్రమంలో కీలక వ్యాఖ్యలు చేసిన కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్
ఇక ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కంట్రోల్ లోకి రాకపోవడంతో అందరూ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా జౌషద సంస్థలు రెండోదశ ప్రయోగాలను పూర్తి చేసుకుని మూడో స్టేజ్‌కు ప్రవేశించాయి. భారత్‌లోనూ కరోనా వ్యాక్సిన్ (Coronavirus vaccine) ప్రయోగాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశంలో వైరస్ వ్యాప్తి, వాక్సిన్ తయారీపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ (Union health minister Harsh Vardhan) కీలక వ్యాఖ్యలు చేశారు.
New Delhi, Sep 13: దేశంలో కరోనా వైరస్ రోజు రోజుకు విశ్వరూపం దాల్చుతోంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కంట్రోల్ లోకి రాకపోవడంతో అందరూ వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే చాలా జౌషద సంస్థలు రెండోదశ ప్రయోగాలను పూర్తి చేసుకుని మూడో స్టేజ్‌కు ప్రవేశించాయి. భారత్‌లోనూ కరోనా వ్యాక్సిన్ (Coronavirus vaccine) ప్రయోగాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే దేశంలో వైరస్ వ్యాప్తి, వాక్సిన్ తయారీపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ (Union health minister Harsh Vardhan) కీలక వ్యాఖ్యలు చేశారు.
2021 ఫిబ్రవరి, మార్చి నెలల్లో కరోనా విరుగుడు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. వైరస్‌పై పోరులో ముందుండి ప్రజలను రక్షిస్తున్న వైద్యులు, పోలీసులు, మున్సిపల్ సిబ్బందికి తొలుత వ్యాక్సిన్‌ను అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రయోగాల అనంతరం తొలి వ్యాక్సిన్ తీసుకోవాడానికి ఎవరూ ముందుకు రాకపోతే తానే స్వయంగా వ్యాక్సిన్‌ను వేసుకుంటానని ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ సండే సంవాద్ కార్యక్రమంలో సోషల్ మీడియాలో (Social media interaction programme) నెటిజన్లు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయన తెలిపారు.
Here's Union health minister Harsh Vardhan Tweet
కరోనా విరుగుడు టీకాపై ప్రజలకు మరింత భరోసా కల్పించడానికి తొలి ప్రయోగంగా తాను అందుబాటులో ఉంటానని కేంద్ర మంత్రి తెలిపారు. ఇక ప్రపంచ దేశాలతో పోలిస్తే కరోనా వ్యాప్తి భారత్‌లో చాలావరకు తక్కవగా ఉందన్నారు. అంతేకాకుండా రికరీ రేటు కూడా పెద్ద ఎత్తున ఉందని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఓ సోషల్ మీడియా వేదికగా ‘సండే సంవాద్’ అనే (Sunday Samvaad) కార్యక్రమాన్ని మంత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు.
దేశంలో కరోనావైరస్ వెలుగుచూసిన మొదట్లో కనీసం పీపీఈ కిట్లు కూడా అందుబాటులో లేవని, ఇతర దేశాల నుంచి దిగువతి చేసుకున్న పరిస్థితి ఉందని ఆయన గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా స్వదేశంలో తయారు చేసిన కిట్లనే వాడుతున్నామని చెప్పారు.
దేశంలో గడిచిన 24 గంటల్లో 97,570 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇప్పటి వరకు వెలుగుచూసిన కేసుల సంఖ్య 46,59,984 కు చేరింది. ఇక దేశవ్యాప్తంగా శనివారం ఒక్కరోజే 10,71,702 కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా, మొత్తం పరీక్షల సంఖ్య 5,62,60,928 చేరుకుంది.