Indian Parliament (Photo credits: Wikimedia Commons)

New Delhi, Sep 13: రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు (Parliament Monsoon Session) ప్రారంభం కానున్న నేపథ్యంలో లోక్ సభ, రాజ్యసభ ఎంపీలకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో కొంతమంది ఎంపీలకు కరోనా పాజిటివ్ అని తేలినట్లుగా తెలుస్తోంది. ఢిల్లీ వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. ఇప్పటి వరకు పలువురు ఎంపీలకు, కేంద్రమంత్రులకు కరోనా పాజిటివ్‌గా (COVID-19 Positive) తేలినట్లు వార్తలు వస్తున్నాయి. అయితే సమావేశాల మధ్యలో ఎవరికైనా వైరస్‌ (COVID) సోకితే మరింత వ్యాప్తి చెందే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.

ఇప్పటివరకు పశ్చిమ బెంగాల్ రాజ్యసభ ఎంపీ శాంతా చెత్రీ, బీజేపీ ఎంపీ సుకంత మజుందార్ లకు కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ రోజు COVID-19 పాజిటివ్ పరీక్షించారు. పాజిటివ్ వచ్చింది. గత కొద్ది రోజులుగా నాతో సన్నిహితంగా ఉన్న వారందరి ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని మరియు ఏవైనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేయమని అభ్యర్థిస్తున్నాను ”అని మజుందార్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.

దేశంలో కరోనా వైరస్‌ (India CoronaVirus) విజృంభిస్తున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక పరిస్థితుల్లో పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే సమావేశాలకు 72 గంటల ముందు ఎంపీలు అందరికీ కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా పరీక్షలకు హాజరైన ఎంపీలందరికీ కరోనా నెగటివ్‌గా తేలితే వారికి సర్టిఫికెట్‌ సైతం జారీచేయనున్నారు.

Dr. Sukanta Majumdar Tweet

MP Shanta Chhetri  Tweet

ఆ పత్రం ఉన్న వారినే సభలోకి అనుమతిస్తామని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా ఇదివరకే స్పష్టం చేశారు. ఇప్పటికే కరోనా పరీక్షల ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. శని, ఆదివారాల్లో ఎంపీలందరికీ పరీక్షలు నిర్వహించారు. అయితే ఈ టెస్టుల్లోనూ కొంతమంది ఎంపీలకు పాజిటివ్‌గా తేలినట్లు సమాచారం అందుతోంది. దీంతో సమావేశాలకు హాజరైన ఎంపీల్లో కలవరం మొదలైంది.

మరోవైపు ఎంపీలతో పాటు, పార్లమెంటు ఆవరణలోనికి ప్రవేశించే వివిధ మంత్రిత్వ శాఖలకు చెందిన అధికారులు, మీడియా ప్రతినిధులు, లోక్‌సభ, రాజ్యసభ సెక్రటేరియట్‌ సిబ్బంది అంతా సమావేశాల ప్రారంభానికి ముందే పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్‌ కోరారు. కాగా వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్‌ 14 న ప్రారంభమై, అక్టోబర్‌ 1కి ముగియనున్నాయి

కరోనా విశ్వరూపం..11 రోజుల్లో 12 వేల మంది మృతి, 10 లక్షల కేసులు నమోదు, తాజాగా 94,373 మందికి కోవిడ్-19, దేశంలో 47,54,357కు చేరుకున్న కరోనా కేసుల సంఖ్య

కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో కాగితం వాడకాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎంపీలు తమ గుర్తింపును డిజిటల్‌గా నమోదు చేస్తారు. సభలోకి ప్రవేశించే ప్రజలందరి శరీర ఉష్ణోగ్రతను తనిఖీ చేయడానికి థర్మల్ గన్స్ మరియు థర్మల్ స్కానర్లు ఉపయోగించబడతాయి. ప్లార్లమెంట్‌లోని 40 ప్రదేశాలలో టచ్‌లెస్ శానిటైజర్‌లను ఏర్పాటు చేస్తారు మరియు స్టాండ్‌బైలో అత్యవసర వైద్య బృందం మరియు అంబులెన్స్ కూడా ఉంటుంది. కోవిడ్ -19 నివారణకు సంబంధించిన అన్ని మార్గదర్శకాలను ఖచ్చితంగా పాటిస్తారు.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ 257 మంది ఎంపీలు సభ ప్రధాన హాలులో, 172 మంది ఎంపీలు సందర్శకుల గ్యాలరీలో కూర్చుంటారు. ఇవే కాకుండా లోక్‌సభలో 60 మంది సభ్యులు రాజ్యసభ ప్రధాన గదిలో కూర్చుంటారు. అదనంగా, 51 మంది సభ్యులు ఎగువ సభ (రాజ్యసభ) గ్యాలరీలో కూర్చుంటారు. లోక్‌సభ కార్యక్రమాల్లో రాజ్యసభ ఛాంబర్‌లో కూర్చున్న సభ్యులు పాల్గొంటారని బిర్లా తెలిపారు. ఆపరేషన్ సజావుగా సాగేలా ఎల్‌ఈడీ స్క్రీన్ ఇన్‌స్టాల్ చేయబడుతుంది. కార్యకలాపాల్లో పాల్గొనే సభ్యుల గుర్తింపు మొబైల్ ద్వారా జరుగుతుందని ఆయన తెలియజేశారు.