COVID-19 in India: మనుషుల మధ్య శాశ్వతంగా ఉండిపోనున్న కరోనా, దీనికి అంతం లేదని చెబుతున్న నిపుణులు, జాగ్రత్తలు తీసుకుని వైరస్ ను అడ్డుకోవాలని సూచన

దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Virus (Photo Credits : Pixabay)

New Delhi, April 12: భారత్‌లో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆందోళన అక్కర్లేదని, తగు జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవచ్చని ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్లు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అయితే రాబోయే రెండు వారాల్లో భారత్‌లో కేసులు విపరీతంగా పెరుగుతాయని, ఆ తర్వాత గణనీయంగా తగ్గిపోతాయని చెబుతున్నారు.

కొవిషీల్డ్‌ వ్యాక్సిన్ల ఉత్పత్తిని ప్రారంభించిన సీరం, రాబోయే మూడు నెలల్లో ఏడు మిలియన్ల డోసులను అందుబాటులోకి తేవాలని లక్ష్యం

రాబోయే 10-12 రోజుల్లో ఎండెమిక్‌ స్టేజ్‌(స్థానిక దశ)కు ( COVID-19 Entering Endemic Stage) కేసుల సంఖ్య చేరుకోవచ్చు. ఆ తర్వాత కేసుల్లో తగ్గుదల కనిపిస్తుంది. అంతేకాదు కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నప్పటికీ.. ఆస్పత్రిలో చేరికలు తక్కువగా ఉన్నాయని, రాబోయే రోజుల్లోనూ ఇది ఇలాగే కొనసాగుతుందని అధికార వర్గాలు బుధవారం వెల్లడించాయి. కాగా ఒమిక్రాన్‌ సబ్‌ వేరియెంట్‌ ఎక్స్‌బీబీ.1.16 కారణంగా భారత్‌లో కరోనా కేసులు పెరుగుతూ పోతున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరిలో 21.6 శాతం, మార్చిలో 35.8 శాతం పెరుగుదల నమోదు అయ్యింది.

ఎండెమిక్ (COVID-19 Entering Endemic Stage In India) అంటే ఏదైనా ఒక వ్యాధి ప్రజల మధ్య శాశ్వతంగా ఉండిపోయే స్థితి. "ఎండెమిక్‌గా మారి, పూర్తిగా అంతం కాని ఎన్నో వ్యాధులు ఇప్పుడు మన మధ్యే ఉన్నాయి. అవి మనుషుల నుంచి మనుషులకు వ్యాపిస్తూ ఎండెమిక్‌గా మారుతాయి. అంటే తట్టు, సాధారణ ఫ్లూ, హెపటైటిస్-ఎ, హెపటైటిస్-బి, మశూచి లాంటి వ్యాధులు. పాండెమిక్ అంటే ప్రజల్లో తీవ్రంగా సోకి, పెద్ద ఎత్తున వ్యాపించే ఒక వ్యాధి.