Corona Disinfection Tunnel: ఈ దెబ్బతో కరోనావైరస్ చస్తుంది, తమిళనాడులో సరికొత్త ప్రయోగం, తిర్పూర్ జిల్లా మార్కెట్లో కరోనా డిస్ ఇన్‌ఫెక్షన్ టన్నెల్ ఏర్పాటు, ప్రశంసించిన ఆర్థిక మంత్రి
ఈ నేపథ్యంలోనే తమిళనాడు (Tamil Nadu) సర్కారు ముందడుగు వేసింది. అక్కడ తిర్పూర్ జిల్లాలో (Tamil Nadu’s Tiruppur) మార్కెట్ల ముందు ‘కరోనా డిస్ ఇన్‌ఫెక్షన్ టన్నెల్’ (Corona Disinfection Tunnel) ఏర్పాటుచేశారు. సుమారు 16 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పుతో ఈ టన్నెల్ నిర్మించారు. దానికి రెండు సెట్ల స్ప్రేయర్లను అమర్చారు.
Chennai, April 15: దేశంలో కరోనావైరస్ (Coronavirus) పంజా విసురుతున్న నేపథ్యంలో అది రాకుండా ఉండేందుకు రాష్ట్రాలు పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తమిళనాడు (Tamil Nadu) సర్కారు ముందడుగు వేసింది. అక్కడ తిర్పూర్ జిల్లాలో (Tamil Nadu’s Tiruppur) మార్కెట్ల ముందు ‘కరోనా డిస్ ఇన్‌ఫెక్షన్ టన్నెల్’ (Corona Disinfection Tunnel) ఏర్పాటుచేశారు. సుమారు 16 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పుతో ఈ టన్నెల్ నిర్మించారు. దానికి రెండు సెట్ల స్ప్రేయర్లను అమర్చారు.
యువ ఐఏఎస్ అధికారికి కరోనావైరస్
ఇలా అమర్చిన ఒక్కో సెట్‌కు మూడు నాజిల్స్ ఉంటాయి. వాటి ద్వారా కరోనా వైరస్‌ను నాశనం చేసే ‘సోడియం హైపోక్లోరైట్’ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. కాగా మార్కెట్‌కు వచ్చేవారంతా ముందు అక్కడ ఏర్పాటుచేసిన వాష్‌బేసిన్ల వద్ద సబ్బుతో చేతులు కడుక్కోవాలి. ఆ తరువాత ఈ టన్నెల్ గుండా చేతులు రెండు పైకెత్తి నడుచుకుంటూ వెళ్లాలి. వారిపై సుమారు ఐదు సెకన్లపాటు హైపోక్లోరైట్ ద్రావణం వెదజల్లుతారు. ఇలా చేయడం వల్ల శరీరంపై కరోనా వైరస్ ఏమైనా వుంటే చనిపోతుంది.
Here's FM Tweet
ఈ ద్రావణంతో ఎటువంటి ప్రమాదం ఉండదు. ఈ ద్రావణం కంట్లో పడినా మంట పుట్టదు. ఆ విధంగా దానిని ఒక శాతం సోడియం హైపోక్లోరైట్ 1 పీపీఎం (పార్ట్స్ పెర్ మిలియన్)తో తయారుచేశారు. దీనిని అక్కడి వైద్యులు పరీక్షించి ఓకే చేశారు. ఈ టన్నెల్ తయారీకి భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ)కి చెందిన యంగ్ ఇండియన్స్ విభాగం సహకారం అందించింది.
కాగా ఒక టన్నెల్ తయారీకి సుమారు రూ.90 వేలు ఖర్చు అయింది. ఈ మొత్తానికి వేయి లీటర్ల ద్రావణం వస్తుంది. దాంతో 16 గంటల పాటు నిరంతరం పిచికారీ చేయవచ్చు. గంటకు 50 లీటర్లు వినియోగమవుతోంది. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో తమిళనాడులోని ఇతర జిల్లాల్లోను వీటి ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నారు. వీటిని ఎస్‌బీఐ వంటి సంస్థలు స్పాన్సర్ చేయడానికి ముందుకువస్తున్నాయి.