Bill Gates: కరోనాకు 2021లో అంతం తప్పదు, ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన బిలియనీర్‌ బిల్‌ గేట్స్‌, ధనిక దేశాల్లో 2021 మే నాటికి..మిగతా దేశాల్లో 2022 చివరి నాటికి కనుమరుగవుతుందని వెల్లడి

అమెరికన్ మ్యాగజైన్ వైర్డ్ (American magazine Wired)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్‌ మాట్లాడుతూ.. ‘త్వరలోనే కోవిడ్-19 వ్యాక్సిన్‌ (COVID-19 vaccine) అందుబాటులోకి వస్తుంది. ధనిక దేశాల్లో 2021 మే నాటికి మహమ్మారి అంతం అవుతుంది. మిగతా దేశాల్లో 2022 చివరి నాటికి వైరస్‌ తుడిచిపెట్టుకుపోతుందని తెలిపారు.

Bill Gates | File Image | (Photo Credit: Getty Images)

New Delhi, August 10: కోవిడ్ మహమ్మారి ప్రపంచ దేశాలను (COVID 19 pandemic) వణికిస్తోంది. వైరస్‌ను నిర్మూలించే వ్యాక్సిన్‌ కోసం ఇప్పటికే ప్రపంచ దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. రష్యా వ్యాక్సిన్ ఇప్పటికే ఆశలను రేకెత్తిస్తుండగా మన దేశంలో ఈ నెల చివరి నాటికి వ్యాక్సిన్‌ (coronavirus vaccine) తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో మైక్రోసాఫ్ట్‌ కో ఫౌండర్‌, బిలియనీర్‌ బిల్‌ గేట్స్‌ (Bill Gates) కరోనావైరస్ అంతానికి సంబంధించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

కరోనావైరస్ అంతం అయ్యే రోజు దగ్గరలో ఉందని అన్నీ అనుకూలిస్తే ఇది 2021 మే నాటికి చాలా దేశాల్లో కరోనా కనుమరుగవుతుందని (COVID 19 may end in 2021)  బిల్ గేట్స్ అన్నారు.  అమెరికన్ మ్యాగజైన్ వైర్డ్ (American magazine Wired)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బిల్‌గేట్స్‌ మాట్లాడుతూ.. ‘త్వరలోనే కోవిడ్-19 వ్యాక్సిన్‌ (COVID-19 vaccine) అందుబాటులోకి వస్తుంది. ధనిక దేశాల్లో 2021 మే నాటికి మహమ్మారి అంతం అవుతుంది. మిగతా దేశాల్లో 2022 చివరి నాటికి వైరస్‌ తుడిచిపెట్టుకుపోతుందని తెలిపారు. రష్యా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌, ఆగస్టు 12వ తేదీన రిజిస్టర్ చేయనున్నట్టు ప్రకటించిన రష్యా ఉప ఆరోగ్యశాఖ మంత్రి, మార్గదర్శకాలు పాటించాలని కోరిన డబ్ల్యూహెచ్ఓ

కరోనావైరస్ వల్ల కలిగిన ఆర్థిక వినాశనం నుంచి కోలుకోవడం అంత తేలిక కాదని.. కాకపోతే ఈ వైరస్‌ వైద్యరంగంలో ఎన్నో నూతన ఆవిష్కరణలు వెలుగులోకి తీసుకురావడానికి సాయం చేసిందని తెలిపారు. నూతన చికిత్స విధానాలు, వ్యాక్సిన్‌ పరిశోధనల్లో పురోగతి జరిగిందని బిల్‌ గేట్స్‌ అన్నారు. కరోనాకు చెక్ పెట్టినట్లే, కోవిడ్ వ్యాక్సిన్‌ను రూ.225కే విక్రయిస్తామని తెలిపిన సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్, బిల్ అండ్ మిలిందా గేట్స్ ఫౌండేషన్‌తో డీల్ కుదుర్చుకున్న గవి

కాగా కరోనా వ్యాక్సిన్‌ కోసం బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌ నిధులు సమకూర్చతున్నది. ఈ క్రమంలో గతవారం పూణేకు చెందిన సీరం ఇన్‌స్టిట్యూట్‌.. బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్ ఫౌండేషన్‌ నుంచి 150 మిలియన్‌ డాలర్ల నిధులు.. అంతర్జాతీయ వ్యాక్సిన్ కూటమి గేవ్ నుంచి 100 మిలియన్ డాలర్ల నిధులు అందుకుంది.

సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసే కొన్ని వ్యాక్సిన్లు ఆస్ట్రాజెనెకా, నోవావాక్స్ రెండింటికి గాను ఒక డోస్‌కి 3 డాలర్ల ధర నిర్ణయించబడింది. ఇది 90 కి పైగా దేశాలలో అందుబాటులో ఉండనున్నట్లు సమాచారం. బిల్‌ అండ్‌ మిలిండా గేట్స్‌ ఫౌండేషన్‌తో పాటు దీని మద్దతు ఉన్న గవి కూడా ప్రపంచ దేశాలన్నింటికి వేగంగా.. సమానంగా కరోనా వ్యాక్సిన్‌ డెలివరీ చేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చింది.