Coronavirus pandemic: ఏప్రిల్ 15 తర్వాత లాక్‌డౌన్ 62 జిల్లాల్లోనే కొనసాగుతుందా? దేశంలో 62 జిల్లాల్లోనే 80 శాతం కేసులు, దేశం మొత్తం మీద 274 జిల్లాల్లో కరోనా పాజిటీవ్ కేసులు

దేశం మొత్తం మీద 736 జిల్లాలు ఉంటే అందులో 62 జిల్లాల్లో కరోనావైరస్ (COVID 19) ఆందోళనకరంగా మారింది. ఈ జిల్లాల్లో దాదాపు 80 శాతం కేసులు బయటపడ్డాయి. భారతదేశం (India) మొత్తంమీద 274 జిల్లాల్లో కరోనా పాజిటీవ్ కేసులు బైటపడ్డాయి. మిగిలిన జిల్లాలు సేఫ్ జోన్ లో ఉన్నాయి. కొన్ని జిల్లాలో అక్కడక్క కరోనా కేసులున్నాయి. అందుకే దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ను (Lockdown) ఎత్తివేసినా, ఈ జిల్లాల్లో లాక్‌డౌన్ కంటిన్యూ అవుతుందని ఉన్నతస్థాయి వర్గాలు అంటున్నాయి .

Image Used For Representative Purpose Only. | File Photo

New Delhi, April 7: దేశంలో కరోనామహమ్మారి (Coronavirus) తీవ్రరూపం దాల్చుతోంది. దేశం మొత్తం మీద 736 జిల్లాలు ఉంటే అందులో 62 జిల్లాల్లో కరోనావైరస్ (COVID 19) ఆందోళనకరంగా మారింది. ఈ జిల్లాల్లో దాదాపు 80 శాతం కేసులు బయటపడ్డాయి. భారతదేశం (India) మొత్తంమీద 274 జిల్లాల్లో కరోనా పాజిటీవ్ కేసులు బయటపడ్డాయి.

ఏడాది పాటు ప్రధాని,రాష్ట్రపతి,ఎంపీల జీతాల్లో 30 శాతం కోత

మిగిలిన జిల్లాలు సేఫ్ జోన్ లో ఉన్నాయి. కొన్ని జిల్లాలో అక్కడక్క కరోనా కేసులున్నాయి. అందుకే దేశవ్యాప్తంగా ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ను (Lockdown) ఎత్తివేసినా, ఈ జిల్లాల్లో లాక్‌డౌన్ కంటిన్యూ అవుతుందని ఉన్నతస్థాయి వర్గాలు అంటున్నాయి . ముంబై ఆస్పత్రిలో కరోనా కల్లోలం

దేశంలో ఇప్పటిదాకా 4,315 కేసుల్లో 328 మందికి నయమైతే 118 మంది చనిపోయారు. అంటే మరణాల శాతం 2.7గా ఉంది. మొత్తం కేసుల్లో రికవరీ రేటు 7.6శాతంగా ఉంది. ఇంతవరకు దేశంలో ఒక్కరు కూడా ICUలో లేరు. కాగా మార్చి 30నాటికి కేసులు 1,251 ఐతే, అందులో 32 మంది చనిపోయారు. ఇప్పుడు కేసుల సంఖ్య 4067గా ఉన్నాయి. చనిపోయిన వారి సంఖ్య 109గా ఉంది. రికవరీ అయిన వారు 292మందిగా ఉన్నారు.

మీరంతా చావు కోసమే చూస్తున్నారు

అయితే కరోనా కొన్ని ప్రాంతాల్లోనే చాలా ఎక్కువగా వ్యాప్తి చెందింది. వీటిని హాట్ స్పాట్‌గా పిలుస్తున్నారు. అందుకే ఈ జిల్లాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్భందించి, కరోనా కట్టడి కోసం ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ టెస్టింగ్ లు కూడా పెరిగాయి. రెండు రోజుల్లోనే రెండింతలయ్యాయి. వచ్చే వారంలో టెస్టింగ్‌ల సంఖ్య రెండింతలు కానుంది.

చైనాలో మళ్లీ కరోనా కలకలం, కొత్తగా 39 కేసులు నమోదు

కాగా కరోనా కేసులు ఎక్కువగా నమోదువుతున్న ఈ 62 జిల్లాల సరిహద్దులను మూసేసి, కట్టుదిట్టంగా దిగ్బందించారు. ఈ నిర్భంధానికి అనధికారికంగా “Bhilwara model”అని కేంద్రం పేరు పెట్టింది. కాగా గాల్లోకూడా కరోనా వ్యాపిస్తోందన్న వాదనలకు సరైన రుజువులు లేవని Indian Council of Medical Research (ICMR) తేల్చేసింది.

అమెరికాలో కరోనా మృత్యుఘోష

ఇక దేశంలో personal protective equipment (PPE)లు చాలావరకు అందుబాబులో వచ్చాయి. మొదట్లో పిపిఈలు లేక రెయిన్ కోట్లేసుకొని డాక్టర్లు కరోనా పేషెంట్లకు చికిత్స చేశారన్న విమర్శలొచ్చాయి. తర్వాత దేశీయంగా PPE తయారీకి అనుమతిచ్చిన తర్వాత ఒకేసారి వేల కొద్ది పీపీఈలు అందుబాటులోకి రావడంతో దేశవ్యాప్తంగా వీటి పంపిణీ మొదలుపెట్టారు. అవసరమైతే విదేశాల నుంచి PPEలను దిగుమతి చేసుకొంటున్నారు.