Coronavirus Outbreak: China Reports 39 New Cases of COVID-19, One Death (Photo-IANS)

Beijing, April 6: గతేడాది వుహాన్ లో పుట్టి చైనాకు చుక్కలు చూపించిన కరోనావైరస్ (Coronavirus Outbreak) ఇప్పుడు ప్రపంచదేశాలను ముప్పతిప్పలు పెడుతోంది. అయితే మహ్మమారి కరోనా వైరస్‌ను నియంత్రించడంలో చైనా (China) కొంతమేర విజయం సాధించింది.

కాగా వైరస్‌ పురుడుపోసుకున్న చైనాలోని వుహాన్‌ (Wuhan in China) నగరంలో గడిచిన కొన్ని రోజులుగా కొత్త కరోనా కేసులు నమోదు కాలేదంటూ అక్కడి మీడియా పలు కథనాలను వెలవరించింది.

దియా జలావొ గ్రాండ్ సక్సెస్, కరోనాను తరిమికొట్టడానికి ఏకమైన దేశ ప్రజలు

ఈ నేపథ్యంలోనే చైనాలోని దక్షిణ ప్రాంతంలో తాజాగా 30 కరోనా పాజిటివ్‌ కేసులు (New COVID-19 Cases in China) నమోదు అయ్యాయని నేషనల్ హెల్త్ కమిషన్‌ అధికారులు ప్రకటించారు. శనివారం నమోదైన 30 కేసుల్లో 25 మంది విదేశాల నుంచి వచ్చినవారని, ఐదుగురు మాత్రం స్థానికులేనని తెలిపారు. దీంతో చైనా మళ్లీ ఒక్కసారిగా కలవరపాటుకు గురయింది.

కరోనా లక్షణాలతో బాధపడుతున్న మరో 62 మందిని గుర్తించామని వారందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు. గతకొన్నిరోజులుగా స్తబ్దంగా ఉన్న వైరస్‌ మరోసారి వెలుగుచూడటం​ ఆదేశ అధికారులను తీవ్ర ఆందోళనకు గురిస్తోంది. కాగా ఇప్పటి వరకే చైనాలో 81,669 కరోనా పాజిటివ్‌ కేసులు (COVID-19 Cases in China) నమోదు కాగా.. మృతుల సంఖ్య 3,329కి చేరింది. మరోవైపు కరోనా అనుమానితులను ముందుగానే గుర్తించి.. నిర్బంధంలోకి పంపుతున్నారు. ప్రాణాంతక కరోనా వైరస్‌పై పోరుకు చైనా తొలి 50 రోజుల్లోనే అనేక కఠిన చర్యలను అమలు చేసిన విషయం తెలిసిందే.

అమెరికాలో కరోనా మృత్యుఘోష,మోడీ సాయం కోరిన ట్రంప్

ప్రపంచ వ్యాప్తంగా 208 దేశాలకు కరోనా వైరస్‌ వ్యాప్తి చెందింది. మొత్తం 12 లక్షల 72 వేల మంది ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ బారిన పడ్డారు. వైరస్‌ మహమ్మారి 69,424 మందిని చంపేసింది. కరోనా వైరస్‌ నుంచి 2,62,217 మంది బాధితులు కోలుకుంటున్నారు. అమెరికాలో 9,616 మంది, ఇటలీలో 15,887 మంది, స్పెయిన్‌లో 12,641 మంది కరోనా వల్ల మృత్యువాతపడ్డారు.

భారత దేశంలో కరోనా బాధితుల సంఖ్య 4,067కి చేరుకుంది. దేశవ్యాప్తంగా కరోనాతో 109 మంది మృతి చెందారు. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీలో 24 గంటల్లో 700 కొత్త కేసులు నమోదయ్యాయి. మహారాష్ర్టాలో ఇప్పటి వరకు 748 మందికి కరోనా సోకగా, 45 మంది మృతి చెందారు. తమిళనాడులో మొత్త కేసులు 571 కాగా, ఢిల్లీలో బాధితుల సంఖ్య 503కు చేరుకుంది. కేరళాలో 314 మంది వైరస్‌ బారిన పడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో 278, రాజస్థాన్‌లో 266, మధ్యప్రదేశ్‌లో 215, కర్ణాటకలో 151, గుజరాత్‌ 128, జమ్ముకశ్మీర్‌ 106 పాజిటివ్‌ కేసులు ఉన్నాయి.