PM Narendra Modi (Photo Credits: Twitter)

New Delhi, April 6: దీప కాంతిలో భారతావని (India light lamp) వెలుగులీనింది. కరోనా రక్కసి అంతానికి దేశ ప్రజలంతా ఐక్యంగా దీపాలు చేతబూని ప్రతిజ్ఞ చేశారు. కరోనా వైరస్‌ పై (Coronavirus) జరుగుతున్న పోరాటంలో భాగంగా.. ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఇచ్చిన పిలుపుకు దేశ వ్యాప్తంగా అధ్బుతమైన రెస్సాన్స్ కన్పించింది.

రాత్రి 9 గంటల 9 నిమిషాలకు విద్యుత్ దీపాలు ఆర్పి దీప జ్యోతులు వెలిగించాలని పిలుపు

దేశవ్యాప్తంగా ప్రజలు దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్‌ టార్చ్‌లు వెలిగించి కరోనా రాక్షసిని అంతమొందించే ఉమ్మడి సంకల్పానికి ఘనంగా సంఘీభావం తెలిపారుసరిగ్గా 9గంటలకు ( 9 PM 9 Minutes) ఇళ్లలోని విద్యుత్తు దీపాలు ఆపివేసి దీపాలు వెలిగించారు. ప్రధాని మోదీ 9 నిమిషాల మెసేజ్ రహస్యం

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌లు (Telugu State Chief Ministers)తమ క్యాంప్ కార్యాలయాల్లో కొవ్వొత్తులను వెలిగించి సంఘీభావాన్ని ప్రకటించారు. కరోనాపై జరుగుతున్న పోరాటానికి దేశ ప్రజలు అండగా నిలిచారు.

దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వీడియో సందేశం

దీపాలు, కొవ్వొత్తులు, టార్చిలైట్లు, మొబైల్ ఫోన్లను ఉపయోగించి తమ మద్దతును ప్రకటించారు. అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యావత్ దేశం దీపాలు వెలిగించి ఐక్యతను చాట‌డంతో.. ప్రపంచ దేశాలు సయితం శభాష్ ఇండియా అంటూ ప్రశంసిస్తున్నాయి.

Here's ANI Tweet

 

 

ప్రధాని మోదీ కూడా తన ఇంటిముందు దీప స్థంభాన్ని వెలిగించి, కరోనాపై కదనంలో ముందుంటానని దేశ ప్రజలకు ధైర్యం చెప్పారు. కేంద్ర మంత్రులు, రాష్ట్రాల్లో గవర్నర్లు, ముఖ్యమంత్రులు ఈ దీప యజ్ఞంలో మమేకమయ్యారు.ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు రాత్రి 9 గంటలకు కొవ్వొత్తులు వెలిగించారు. ఈ సమయంలో రాష్ట్రపతి భవన్ లోని లైట్లు ఆర్పివేశారు. తమ నివాసాల్లో దీపాలను వెలిగించి, ప్రధాని మోదీ సంకల్పానికి సంఘీభావం తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బాణాసంచా కాల్చడం, హిందూ ప్రార్థనా గీతాలను, మంత్రాలను వినిపించడం కూడా కనిపించింది. మరికొన్ని చోట్ల జాతీయ గీతాన్ని ఆలపించారు.

Heres AP CM Light Lamp campaign

Here's Telangana CM Light Lamp campaign

దేశవ్యాప్తంగా ఇళ్లల్లో విద్యుద్దీపాలను ఒకేసారి 9 నిమిషాల పాటు ఆర్పేసే కార్యక్రమం జరిగినప్పటికీ.. విద్యుత్‌ గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగలేదని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ తెలిపారు. డిమాండ్‌లో ఒకేసారి భారీగా తగ్గుదల, 9 నిమిషాల అనంతరం ఒకేసారి అదే స్థాయిలో పెరుగుదల చోటు చేసుకున్నప్పటికీ.. ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు తమ శాఖ సిద్ధమై, అవసరమైన చర్యలు తీసుకుందన్నారు. ‘గ్రిడ్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నాం. నేను, మా శాఖ కార్యదర్శి, ఇతర సీనియర్‌ అధికారులు స్వయంగా పరిస్థితిని సమీక్షించాం.

సమర్ధవంతంగా ఈ పరిస్థితిని ఎదుర్కొన్న ఎన్‌ఎల్‌డీసీ, ఆర్‌ఎల్‌డీసీ, ఎస్‌ఎల్‌డీసీల్లోని ఇంజినీర్లందరికి అభినందనలు’ అని సింగ్‌ పేర్కొన్నారు. ‘దేశవ్యాప్తంగా ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో విద్యుత్‌ వినియోగం ఒక్కసారిగా 117 గిగావాట్ల నుంచి 85.3 గిగావాట్లకు తగ్గిపోయింది. అంటే 30 గిగావాట్లకు పైగా డిమాండ్‌ తగ్గింది. ఇది మేం తగ్గుతుందని ఊహించిన 12 గిగావాట్ల కన్నా చాలా ఎక్కువ’ అని ఆయన వివరించారు. దీప యజ్ఞం సందర్భంగా ఒకేసారి విద్యుత్‌ వినియోగం తగ్గితే గ్రిడ్‌ కుప్పకూలుతుందని ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే.

ఈ అంటువ్యాధికి వ్యతిరేకంగా దేశ ఐక్యతను చాటి చెప్పింది. యూపీలోని లక్నోలోగల ముస్లిం సోదరులు ఫ్లాష్ లైట్లను వెలిగించి సంఘీభావం తెలిపారు. కరోనా వైరస్ కు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధం మధ్యలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజ్ఞప్తి మేరకు దేశవ్యాప్తంగా ప్రజలు తమ ఇళ్ల బాల్కనీలలో దీపాలను వెలిగించారు. రాష్ట్రపతి నుండి సామాన్యుల వరకు అందరూ దీపాలు, కొవ్వొత్తులు వెలిగించి కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో భాగస్వాములమని నిరూపించుకున్నారు.

.