COVID-19 Scare in India: బీహార్‌‌లో 5 మంది విదేశీయులకు కరోనా, చైనా నుంచి బెంగుళూరుకు వచ్చిన వ్యక్తికి పాజిటివ్, దేశంలో గత 24 గంటల్లో 196 కొత్త కేసులు నమోదు

బీహార్‌(Bihar)లో అయిదుగురు విదేశీయులకు కరోనా సోకినట్లు తేలింది. గయ(Bodh Gaya) విమానాశ్రయంలో నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో వారికి పాజిటివ్‌గా తేలింది. దాంతో ఉలిక్కిపడిన వైద్య శాఖ వెంటనే అప్రమత్తమైంది.

Representational image (Photo Credit- Pixabay)

New Delhi, Dec 26: దేశంలో కరోనా మళ్లీ కలవరం పుట్టిస్తోంది. బీహార్‌(Bihar)లో అయిదుగురు విదేశీయులకు కరోనా సోకినట్లు తేలింది. గయ(Bodh Gaya) విమానాశ్రయంలో నిర్వహించిన ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో వారికి పాజిటివ్‌గా తేలింది. దాంతో ఉలిక్కిపడిన వైద్య శాఖ వెంటనే అప్రమత్తమైంది. బౌద్ధ గురువు దలైలామా నెల రోజుల పాటు బోధ్‌గయలో ఉండనుండటంతో.. ఆయన్ను కలిసేందుకు విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆ ప్రాంతానికి రానున్నారు. ఈ క్రమంలో వైద్య వర్గాలు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాయి.

గయ ఎయిర్ పోర్టు, రైల్వే స్టేషన్ వంటి పలు ప్రాంతాల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశాయి. ఈ క్రమంలో ఆదివారం జలుబు, దగ్గుతో బాధపడుతోన్న 33 మందిని పరీక్షించగా.. 5మందికి పాజిటివ్‌గా తేలింది. వారు ఇంగ్లాండ్‌, మయన్మార్ వాసులని ప్రాథమిక సమాచారం. అందులో ముగ్గురిని గయలో ఐసోలేషన్‌లో ఉంచారు. మరో వ్యక్తి దిల్లీ వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.

చైనాలో కరోనా ప్రళయం.. ఒకే రోజు 3.7 కోట్ల మందికి వైరస్.. మరణాలపై అందని సమాచారం.. వీడియోతో

దాంతో వైద్య వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఇక నిన్న చైనా నుంచి బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రాయానికి చేరుకున్న వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఆ వ్యక్తిని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి, ఐసోలేషన్‌లో ఉంచినట్లు వైద్య వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆ కొవిడ్ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపారు.

దేశంలో గత 24 గంటల్లో 196 కొత్త కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం తెలిపింది.దీంతో దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 4,46,77,302కి చేరింది. ఇక ఇప్పటి వరకు 4,41,43,179 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 3,428 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 5,30,695కి చేరింది.

చైనాలో కరోనా విజృంభణ, రోజుకు 10 లక్షల కరోనా కేసులు, 5 వేల మరణాలు, రానున్న రోజుల్లో ఈ సంఖ్య 42 లక్షలకు చేరుకుంటుందని వార్తలు

ఇక దేశవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 0.01శాతంగా ఉండగా.. రికవరీ రేటు 98.80శాతం, మరణాల రేటు 1.19శాతంగా ఉందని తెలిపింది. ఇప్పటి వరకు 220.05 కోట్ల వ్యాక్సిన్‌ డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.



సంబంధిత వార్తలు