Corona Cases in India: హోం క్వారంటైన్‌లోకి హర్యానా సీఎం, దేశంలో తాజాగా 68,898 మందికి కోవిడ్-19, భారత్‌లో 29 లక్షలు దాటిన కరోనా కేసులు, దేశ రాజధానిలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కేసులు
గడిచిన 24 గంటల్లో 983 కోవిడ్ బాధితులు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 54,849 కు (Coronavirus Deaths in India) చేరింది. తాజాగా 62,282 కరోనా పేషంట్లు కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 21,58,946 కు చేరింది.దేశ రాజధాని ఢిల్లీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు సెరోలాజికల్ సర్వే తెలిపింది. ఢిల్లీలో 29.1 శాతం మంది ప్రజల్లో కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు (వ్యాధి నిరోధక ప్రతిరక్షకాలు) వృద్ధి చెందినట్టు తెలిసింది.
New Delhi, August 21: దేశంలో శుక్రవారం ఒక్కరోజే 68,898 పాజిటివ్ కేసులు (Corona Cases in India) నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 29,05,823 కు (2020 Novel Coronavirus) చేరింది. గడిచిన 24 గంటల్లో 983 కోవిడ్ బాధితులు మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 54,849 కు (Coronavirus Deaths in India) చేరింది. తాజాగా 62,282 కరోనా పేషంట్లు కోలుకున్నారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 21,58,946 కు చేరింది.దేశ రాజధాని ఢిల్లీలో కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్నట్లు సెరోలాజికల్ సర్వే తెలిపింది. ఢిల్లీలో 29.1 శాతం మంది ప్రజల్లో కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు (వ్యాధి నిరోధక ప్రతిరక్షకాలు) వృద్ధి చెందినట్టు తెలిసింది.
ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్ర జైన్ గురువారం ఈ వివరాలను తెలియజేశారు. ఈనెల 1 నుంచి 7వ తేదీ మధ్య రెండో దఫా సెరో సర్వే జరిగిందని, దీంట్లోభాగంగా 15 వేల మంది నమూనాలను పరీక్షించినట్టు వివరించారు. 28.3 శాతం పురుషుల్లో, 32.2 శాతం మహిళల్లో యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు గుర్తించామన్నారు. జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌కి కరోనా, ట్విట్టర్ ద్వారా తెలియజేసిన కేంద్ర మంత్రి, అపెక్స్ కౌన్సిల్ సమావేశంపై సందేహాలు
జూలైలో నిర్వహించిన తొలి సెరో సర్వేలో దాదాపు 22 శాతం మందిలో యాంటీబాడీలను గుర్తించినట్టు జైన్ గుర్తుచేశారు. అంటే ఢిల్లీ ప్రజల్లో కరోనాను ఎదుర్కొనే సహజ సామర్థం క్రమంగా పెరుగుతున్నట్లు తేలింది. మరోవైపు, పంజాబ్‌లోని 5 కంటైన్మెంట్ జోన్లలోని 27.7శాతం ప్రజల్లో యాంటీబాడీలు వృద్ధి చెందినట్టు అధికారులు తెలిపారు.
ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ రెండు, మూడో దశ ట్రయల్స్‌ను భారత్‌లో సీరం ఇన్‌స్టిట్యూట్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ టీకాకు సంబంధించిన మూడో దశ ట్రయల్స్ ఒకటి రెండు రోజుల్లో ప్రారంభం కానున్నాయని నీతి ఆయోగ్ చీఫ్ వీకే పాల్ తెలిపారు. ఈ దశ పూర్తికావడానికి ఏడు నెలల సమయం పట్టొచ్చని అంచనా వేశారు. మరోవైపు, కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తికి అనుమతులు లభించిన వెంటనే ప్రాధాన్యత క్రమంలో బంగ్లాదేశ్‌కి టీకాను ఎగుమతి చేస్తామని విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగాల పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ -2020, ఏపీలో సత్తా చాటిన మూడు నగరాలు, టాప్ టెన్‌లో చోటు దక్కించుకున్న విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, హర్షం వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి
కరోనా లక్షణాలున్న పలువురిని కలవడంతో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ ముందు జాగ్రత్త చర్యగా హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు. కరోనా బారినపడిన కేంద్ర జలశాఖ మంత్రి గజేంద్రసింగ్ షెకావత్‌ను సీఎం ఈ నెల 19న కలిసి సమావేశంలో పాల్గొన్నారు. అలాగే, కరోనా లక్షణాలున్న పలువురిని కలిశారు. దీంతో అప్రమత్తమైన సీఎం.. కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఫలితాల్లో నెగటివ్ వచ్చినప్పటికీ ముందుజాగ్రత్త చర్యగా మూడు రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉండనున్నట్టు మనోహర్‌లాల్ ప్రకటించారు. మరోవైపు, షెకావత్‌తో జరిగిన సమావేశంలో పాల్గొన్న కేంద్ర సహాయమంత్రి రతన్‌లాల్ కటారియా కూడా హోం క్వారంటైన్‌లోకి వెళ్లారు.