COVID-19 Vaccine Update: డెల్టా వేరియంట్ నుంచి రక్షణ కల్పించడంలో కొవాగ్జిన్‌ టీకా భేష్, ఎన్‌ఐవీ-ఐసీఎంఆర్‌ సంయుక్త అధ్యయనంలో వెల్లడైన వాస్తవాలు, డెల్టాతో పాటు బీటా వేరియంట్‌నూ సమర్థవంతంగా ఎదుర్కుంటోందని తెలిపిన పరిశోధకులు

భారత్‌లో రెండో దశ కరోనా వేవ్ కల్లోలానికి కారణంగా భావిస్తోన్న డెల్టా వేరియంట్ (Beta And Delta Variants) నుంచి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా (Bharat Biotech's COVAXIN) మెరుగైన రక్షణ కల్పిస్తోందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది.

Covaxin (Photo Credits: Bharat Biotech)

New Delhi, June 9: భారత్‌లో రెండో దశ కరోనా వేవ్ కల్లోలానికి కారణంగా భావిస్తోన్న డెల్టా వేరియంట్ (Beta And Delta Variants) నుంచి భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్‌ టీకా (Bharat Biotech's COVAXIN) మెరుగైన రక్షణ కల్పిస్తోందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. పుణెకు చెందిన నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ(ఎన్‌ఐవీ), భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌) సంయుక్తంగా ఇటీవల ఈ అధ్యయనం చేపట్టాయి. డెల్టాతో పాటు బీటా వేరియంట్‌నూ ఈ టీకా (COVID-19 Vaccine Update) సమర్థంగా ఎదుర్కంటోందని వారి అధ్యయనంలో తేలింది.

కొవిడ్‌ నుంచి కోలుకున్న 20 మంది, కొవాగ్జిన్‌ రెండు డోసులు తీసుకున్న 17 మంది నుంచి రక్తనమూనాలను సేకరించి తటస్థీకరణ సామర్థ్యాన్ని అంచనా వేశారు. కొవాగ్జిన్‌ టీకా తీసుకున్న వీరిలో డెల్టా, బీటా వైరస్‌లను తటస్థీకరించే సామర్థ్యం ఎక్కువ ఉందని, ఈ రకాల నుంచి కొవాగ్జిన్‌ ఎక్కువ రక్షణ కల్పిస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ అధ్యయన నివేదికను బయోరిక్సివ్‌ ప్రీప్రింట్‌ సర్వర్‌లో పోస్ట్ చేయగా.. దీన్ని ఇంకా సమీక్షించాల్సి ఉంది. ఐసీఎంఆర్‌ చీఫ్‌ బలరాం భార్గవ, భారత్‌ బయోటెక్‌కు చెందిన ఒక శాస్త్రవేత్త ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.

దేశంలో రెండోరోజు లక్షకు దిగువన కేసులు నమోదు, కొత్తగా 92,596 మందికి కరోనా, తాజాగా 1,62,664 మంది కోలుకొని డిశ్చార్జ్‌, ప్రస్తుతం 12,31,415 యాక్టివ్‌ కరోనా కేసులు

డెల్టా వేరియంట్‌(బి.1.617.2) వైరస్‌ రకాన్ని తొలుత భారత్‌లో గుర్తించగా.. బీటా వేరియంట్‌(బి.1.351) మొట్టమొదట దక్షిణాఫ్రికాలో బయటపడింది. భారత్‌లో రెండో దశవ్యాప్తికి డెల్టా రకమే కారణమని, ఇతర రకాలతో పోలిస్తే ఇది వేగంగా వ్యాప్తి చెందుతోందని ఇటీవల ఓ అధ్యయనం వెల్లడించింది. అయితే డెల్టా రకం వల్ల ఎక్కువ మరణాలు నమోదవుతున్నట్లు ఆధారాలేమీ లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇక కొవిడ్‌ వైరస్‌పై కొవాగ్జిన్‌తో పాటు కొవిషీల్డ్‌ టీకా కూడా సమర్థంగా పనిచేస్తున్నాయని మరో అధ్యయనం వెల్లడించిన విషయం తెలిసిందే. వైరస్‌కు వ్యతిరేకంగా మంచి రోగనిరోధకతను అవి ఉత్పత్తి చేస్తున్నాయని నిర్ధారించింది. అధ్యయన నివేదిక ప్రకారం.. రెండో డోసు పూర్తయ్యాక కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ రెండూ మంచి రోగ నిరోధక సామర్థ్యాన్ని చేకూర్చాయి.

జనాభా ప్రాతిపదికన రాష్ట్రాలకు వ్యాక్సిన్ల‌ పంపిణీ, వృథా చేస్తే ఇచ్చే వ్యాక్సిన్ల‌లో కోత‌, టీకా పంపిణీపై నూతన మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం, జూన్ 21 నుంచి దేశంలో 18 ఏళ్లు నిండిన వారికి ఉచిత వ్యాక్సిన్

కొవాగ్జిన్‌తో పోలిస్తే కొవిషీల్డ్‌ గ్రహీతల్లో యాంటీబాడీ స్థాయులు ఎక్కువగా కనిపించాయి. రెండో డోసు పూర్తయ్యాక 95% మందిలో సీరోపాజిటివిటీ (యాంటీబాడీల ఉత్పత్తి) కనిపించింది. కొవిషీల్డ్‌ తీసుకున్నవారిలో 98.1%గా, కొవాగ్జిన్‌ వేసుకున్నవారిలో 80%గా అది నమోదైంది. 60 ఏళ్లు పైబడినవారితో పోలిస్తే.. అంతకంటే తక్కువ వయసున్నవారిలో సీరోపాజిటివిటీ రేటు ఎక్కువగా ఉంది.