COVID in India: కరోనా కథ ముగిసేది ఆ నెల్లోనే, సంచలన విషయాలు వెల్లడించిన ఐసీఎంఆర్ ఎపిడెమాలజిస్ట్ చీఫ్ డాక్టర్ సమీరన్ పాండా

అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది మార్చి 11 నాటికి కరోనా కథ ముగిసిపోతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఎపిడెమాలజిస్ట్ చీఫ్ డాక్టర్ సమీరన్ పాండా అంచనా వేస్తున్నారు.డెల్టాను ఒమిక్రాన్‌ అధిగమిస్తే ఇక కరోనా అంతమైనట్టేనని భావించవచ్చని ఎపిడెమియోలాజికల్ విభాగానికి చెందిన సైంటిస్ట్‌ డి సమీరన్ పాండా వెల్లడించారు.

Coronavirus in India (Photo Credits: PTI)

New Delhi, Jan 19: అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ ఏడాది మార్చి 11 నాటికి కరోనా కథ ముగిసిపోతుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఎపిడెమాలజిస్ట్ చీఫ్ డాక్టర్ సమీరన్ పాండా అంచనా వేస్తున్నారు.డెల్టాను ఒమిక్రాన్‌ అధిగమిస్తే ఇక కరోనా అంతమైనట్టేనని భావించవచ్చని ఎపిడెమియోలాజికల్ విభాగానికి చెందిన సైంటిస్ట్‌ డి సమీరన్ పాండా వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. కొత్త వేరియంట్లేవీ ఉద్భవించకపోతే మార్చి 11 నాటికి కోవిడ్ (COVID in India) స్థానికంగా సాధారణ ఫ్లూగా మారుతుందని ఆయన చెప్పారు.

తమ గణాంకాల ప్రకారం డిసెంబరు 11 నుండి ఒమిక్రాన్ వేవ్ మూడు నెలల పాటు కొనసాగనుందన్నారు. దీని ప్రకారం మార్చి 11 తరువాత (Covid may become endemic by March 11) నుంచి కరోనా నుంచి ఉపశమనం లబించవచ్చని పాండా తెలిపారు. అయితే ఢిల్లీ, ముంబై కోవిడ్ కేసుల గరిష్ట స్థాయికి చేరుకున్నాయా, ఇంతటితో ఉదృతి ముగిసిందా అని చెప్పేందుకు మరో రెండు వారాలు వేచి చూడాలన్నారు. వివిధ రాష్ట్రాల్లో మహమ్మారి వివిధ దశల్లో ఉందనీ, వైరస్‌లోని ఎపిడెమియోలాజికల్ వైవిధ్యాలు, కరోనా రూపాంతరాల నేపథ్యంలో ఐసీఎంఆర్‌ తన టెస్టింగ్‌ వ్యూహాన్ని కూడా మార్చుకుంది, పరీక్షల్ని తగ్గించాలని చెప్పలేదని సమీరన్ పాండా అన్నారు.

సుప్రీంకోర్టులో కరోనా అలజడి, 10 మంది న్యాయమూర్తులకు పాజిటివ్, సుమారు 4 వందల మంది సిబ్బందికి సోకిన వైరస్

హై రిస్క్‌ కాకపోతే కరోనా రోగులు కాంటాక్ట్‌ అయిన వారికి పరీక్షలు చేయాల్సిన అవవసరం లేదనే మార్గదర్శకాలిచ్చినట్టు వెల్లడించారు. అలాగే జెనోమిక్ సీక్వెన్సింగ్ గురించి మాట్లాడుతూ, "జెనోమిక్ సీక్వెన్సింగ్ అనేది ఒక డైనమిక్ దృగ్విషయం. ఆసుపత్రులలో ఇన్ఫెక్షన్ల తీవ్రతను అర్థం చేసుకోవడానికి అధ్యయనం చేస్తున్నామన్నారు. అలాగే మోల్నుపిరావిర్‌ను ప్రభుత్వ ప్రోటోకాల్‌నుంచి మినహాయించడంపై తమకు, డీసీజీఐ మధ్య డిస్‌కనెక్ట్ ఉందనే ఊహాగానాలను తోసిపుచ్చారు. వ్యాక్సినేషన్ తీసుకోని రోగులకు మోల్నుపిరావిర్ ఇవ్వవచ్చు, కానీ గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే మహిళలు,పిల్లలకు దానిని అందించే విషయంలో ఎటువంటి మార్గదర్శకాలు లేవు, అందుకే ఇది ప్రోటోకాల్‌లో లేదని వివరణ ఇచ్చారు.

ఢిల్లీ, ముంబైలో కరోనా కేసులు పతాక స్థాయికి చేరాయా? లేదా అన్నదానికి మరో రెండు వారాల పాటు వేచి చూడాలని చెప్పారు. కరోనా విపత్తు స్థాయి రాష్ట్రాల మధ్య వేర్వేరుగా ఉందన్నారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement