Supreme Court of India | (Photo Credits: IANS)

New Delhi, Jan 19: దేశ అత్యున్నత న్యాయస్థానంలో కరోనా కలకలం రేపింది. సుప్రీంకోర్టులో ఇప్పటివరకు 10 మంది న్యాయమూర్తులు మహమ్మారి బారినపడగా, సుమారు 4 వందల మంది సిబ్బందికి కరోనా సోకింది. దీంతో బాధితులకు న్యాయసహాయం అందించండ ఆలస్యమవుతుండగా, న్యాయమూర్తులకు కేసులు కేటాయిండంలో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సుప్రీంకోర్టు (Supreme Court)లోని 32 మంది జడ్జిల్లో ఇప్పటివరకు పది మందికి కరోనా పాజిటివ్ (10 judges infected) వచ్చిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో జస్టిస్ కేఎం జోసెఫ్‌, పీఎస్ నరసింహ కరోనా నుంచి కోలుకుని తిరిగి విధుల్లో చేరారు. మరో ఎనిమిది మంది చికిత్స పొందుతున్నారు. అత్యున్నత న్యాయస్థానంలో కరోనా కేసులు (Coronavirus wave) రోజురోజుకు పెరుగుతుండటంతో.. కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమయింది. ప్రతిరోజు 100 నుంచి 200 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహిస్తున్నది. దీంతో ప్రతిరోజు సరాసరి 30 శాతం కేసులు నమోదవుతూ వస్తున్నాయి. కోర్టులో మొత్తం 15 వందల మంది సిబ్బంది ఉండగా సుమారు 4 వందల మందికి పాజిటివ్ వచ్చిందని అధికారులు వెల్లడించారు.

బావ అఖిలేష్ యాదవ్‌కు షాక్, బీజేపీ తీర్థం పుచుకున్న ములాయం సింగ్ యాదవ్ కోడలు అపర్ణా యాదవ్

ఇక శ్రీనగర్‌లోని ప్రభుత్వ వైద్య కళాశాలలో 80 మంది వైద్యులు, పారామెడికల్స్‌ సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడంతో కలకలం సృష్టించింది. జనవరిలో ఇప్పటి వరకు కశ్మీర్‌లో 546 మంది వైద్యులు వైరస్‌కు పాజిటివ్‌గా పరీక్షలు చేశారు. 46 మంది వైద్యులు, 22 మంది ఎంబీబీఎస్ విద్యార్థులు, 15 మంది పారామెడికల్ సిబ్బంది కరోనా సోకిందని జీఎంసీ శ్రీనగర్‌ కమ్యూనిటీ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ మహ్మద్‌ సలీంఖాన్ టిట్టర్‌ ద్వారా తెలిపారు. కొవిడ్‌ కేసుల పెరుగుదల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి, ఫేస్ మాస్క్‌లు ధరించి, సామాజిక దూరం పాటించాలని కోరారు.