Crimes Against Women: మహిళలపై దాడి జరిగితే వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలి, తాజాగా రాష్ట్ర‌, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు అదేశాలు జారీ చేసిన కేంద్ర ప్ర‌భుత్వం

రాష్ట్ర‌, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు నేడు కేంద్ర ప్ర‌భుత్వం కొన్ని కీలక సూచ‌న‌లు చేసింది. మహిళలపై నేరాలకు (Crimes Against Women) సంబంధించి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రహోంమంత్రిత్వశాఖ ( MHA) దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మ‌హిళ‌ల‌పై నేరాలు జ‌రిగిన కేసుల్లో పోలీసులు త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర హోంశాఖ‌ త‌న అడ్వైజ‌రీ ఆదేశాల్లో (MHA Advisory) పేర్కొన్న‌ది.

Crime Against Women. (Photo Credits: IANS)

New Delhi, October 10: యూపీలోని హ‌త్రాస్ అత్యాచార ఘ‌ట‌న నేప‌థ్యంలో.. రాష్ట్ర‌, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు నేడు కేంద్ర ప్ర‌భుత్వం కొన్ని కీలక సూచ‌న‌లు చేసింది. మహిళలపై నేరాలకు (Crimes Against Women) సంబంధించి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్రహోంమంత్రిత్వశాఖ ( MHA) దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. మ‌హిళ‌ల‌పై నేరాలు జ‌రిగిన కేసుల్లో పోలీసులు త‌క్ష‌ణ చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర హోంశాఖ‌ త‌న అడ్వైజ‌రీ ఆదేశాల్లో (MHA Advisory) పేర్కొన్న‌ది.

చాలా హేయ‌మైన రీతిలో మ‌హిళ‌ల‌పై దాడులు జ‌రుగుతున్న నేప‌థ్యంలో కేంద్ర స‌ర్కార్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న నేరాల కేసుల్లో (Sexual Assault) త‌ప్ప‌నిస‌రిగా ఎఫ్ఐఆర్ న‌మోదు చేయాల‌ని కేంద్రం ఆయా రాష్ట్రాల‌కు సూచించింది. రేప్ లాంటి కేసుల్లో కేవ‌లం రెండు నెల‌ల్లోనే విచార‌ణ పూర్తి చేయాల‌ని ఆదేశించింది. మహిళలపై నేరాలు జరిగినపుడు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్‌పీసీ) లోని సెక్షన్ 154 లోని సబ్ సెక్షన్ (1) కింద గుర్తించదగిన నేరం జరిగితే పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం తప్పనిసరి అని కేంద్ర హోంమంత్రిత్వశాఖ పేర్కొంది.

అత్యాచార బాధితుల‌కు 24 గంట‌ల్లోనే మెడిక‌ల్ ప్రొఫెష‌న‌ల్స్ వైద్య‌ ప‌రీక్ష‌లు చేయాల‌ని సూచించింది. ఒక‌వేళ పోలీసులు వెంట‌నే స్పందించ‌లేని ప‌క్షంలో.. అప్పుడు నేర‌స్థుల‌కు న్యాయం జ‌ర‌గ‌డం ఆల‌స్యం అవుతుంద‌ని, దాని ప‌రిణామాలు విప‌రీతంగా ఉంటాయ‌ని కేంద్రం త‌న అడ్వైజ‌రీలో పేర్కొన్న‌ది. మ‌హిళ‌ల రక్ష‌ణ అంశంలో క‌ఠిన‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించింది. మహిళలపై లైంగిక వేధింపుల కేసుల సమాచారం అందిన వెంటనే ఎఫ్ఐఆర్, పోలీసుస్టేషను పరిధికి వెలుపల జరిగితే జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని కేంద్రం ఆదేశించింది.

బుద్ధి మారని చైనాతో ప్రమాదం, 60 వేల మందిని భారత ఉత్తర సరిహద్దులో మోహరించింది, సంచలన వ్యాఖ్యలు చేసిన అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో

మహిళల నేరాలకు సంబంధించి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదులో విఫలమైతే అలాంటి వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని కేంద్రహోంమంత్రిత్వశాఖ హెచ్చరించింది. మహిళల నేరాలపై ఇండియన్ పీనల్ కోడ్ 1860 (ఐపీసీ) లోని సెక్షన్ 166 ఎ (సి) సెక్షన్ 326 ఎ, సెక్షన్ 326 బి, సెక్షన్ 354, సెక్షన్ 354 బి, సెక్షన్ 370, సెక్షన్ 370 ఎ, సెక్షన్ 376, సెక్షన్ 376 ఎ, సెక్షన్ 376 బి, సెక్షన్ 376 బి, సెక్షన్ 376 సి, సెక్షన్ 376 డి, సెక్షన్ 376 డిఎ, సెక్షన్ 376 డిబి, సెక్షన్ 376 ఇ లేదా ఐపిసిలోని సెక్షన్ 509ల ప్రకారం కేసులు పెట్టాలని కేంద్రం సూచించింది.

కాగా యూపీలోని హాత్రాస్ లో 19 ఏళ్ల దళిత యువతిపై నలుగురు ఉన్నత కులస్థులు సామూహిక అత్యాచారం చేసి, హతమార్చిన ఘటనపై దేశవ్యాప్తంగా ప్రతిపక్షపార్టీలు, మహిళా సంఘాల కార్యకర్తుల నిరసన కార్యక్రమాలు చేపట్టిన నేపథ్యంలో కేంద్ర హోంమంత్రిత్వశాఖ మహిళల నేరాలపై సత్వరం చర్యలు తీసుకోవాలని కేంద్రహోంమంత్రిత్వశాఖ తాజాగా సలహా ఇచ్చింది.