Image used for representational purpose | (Photo Credits: PTI)

New Delhi, Oct 10: సరిహద్దులో భారత్-చైనా ఉద్రికత్తలు కొనసాగుతున్న వేళ (India-China Tensions) అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత ఉత్తర సరిహద్దులో చైనా 60 వేల మంది సైనికులను మోహరించిందంటూ (China Deployed 60,000 Soldiers) చైనాపై అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు.కాగా ఇటీవ‌ల భార‌త్‌, చైనా మ‌ధ్య ల‌డాఖ్‌లో స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ త‌లెత్తిన విష‌యం తెలిసిందే. చైనా వైఖ‌రిని ఖండించిన అమెరికా విదేశాంగ మంత్రి.. డ్రాగన్ దేశం త‌న చెడు ప్ర‌వ‌ర్త‌న‌ను బ‌య‌ట‌పెట్టిన‌ట్లు ఆయన (US secretary of state Mike Pompeo) ఆరోపించారు.

క్వాడ్ దేశాల‌కు చైనాతో ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. జ‌పాన్ రాజ‌ధాని టోక్యోలో క్వాడ్ (Quadrilateral‌ Security Dialogue) దేశాల ప్ర‌తినిధులు స‌మావేశం అయిన విష‌యం తెలిసిందే. క్వాడ్ గ్రూపులో అమెరికా, జ‌పాన్‌, ఇండియా, ఆస్ట్రేలియా దేశాలు ఉన్నాయి. దీంతో పాటుగా వుహాన్‌లో ఉద్భవించిన ప్రాణాంతక కరోనా వైరస్‌ గురించి ప్రశ్నించినందుకు ఆస్ట్రేలియాపై బెదిరింపులకు దిగిందని వేధింపులకు పాల్పడిందని ఆయన ఆరోపించారు. చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ పాలన వల్ల ప్రపంచానికి ముప్పు పొంచి ఉందంటూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్‌ పాంపియో డ్రాగన్‌ దేశం చైనాపై మండిపడ్డారు.

కరోనా మా దేశంలో పుట్టలేదంటున్న చైనా, భారత్‌లో తాజాగా 73,272 మందికి కరోనా, 24 గంటల్లో 926 మంది మృతితో 1,07,416 కు చేరుకున్న మరణాల సంఖ్య

గత ప్రభుత్వాల అసమర్థ పాలన వల్ల అమెరికా మేథో సంపత్తిని చైనా దొంగిలించిందని, అయితే అధ్యక్షుడు ట్రంప్‌ అధికారం చేపట్టిన తర్వాత డ్రాగన్‌ ఆట కట్టించి పరిస్థితులను చక్కదిద్దారని పేర్కొన్నారు. కాగా ఇండో- పసిఫిక్‌ ప్రాంతంలో ఆధిపత్యం ప్రదర్శించేందుకు డ్రాగన్‌ దేశం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టే క్రమంలో క్వాడ్‌(క్వాడ్రిలాటరల్‌ సెక్యూరిటీ డైలాగ్‌) దేశాలు మంగళవారం జపాన్‌లో సమావేశమైన (Quad meeting) విషయం తెలిసిందే. ఇందులో భాగంగా అమెరికా, భారత్‌, జపాన్‌, ఆస్ట్రేలియా దేశాల విదేశాంగ మంత్రులు టోక్యోలో భేటీ అయి, స్వేచ్ఛ, నిజాయితీ, సమ్మిళిత ఇండో పసిఫిక్‌ ప్రాంతం కోసం ఉమ్మడిగా పనిచేస్తామని పునరుద్ఘాటించారు.

ఈ క్రమంలో అమెరికాకు తిరిగి వచ్చిన అనంతరం శుక్రవారం ది గయ్‌ బెన్సన్‌ అనే షోలో మైక్‌ పాంపియో మాట్లాడుతూ.. నాలుగు ప్రజాస్వామ్య దేశాలు, ప్రధాన ఆర్థిక వ్యవస్థలు చైనా కమ్యూనిస్టు పార్టీతో ప్రపంచానికి పొంచి ఉన్న ప్రమాదం గురించి చర్చించాయని పేర్కొన్నారు. ఇండో ప‌సిఫిక్ స‌ముద్ర ప్రాంతంలో చైనా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని, భారత్‌లోని వాస్త‌వాధీన రేఖ వెంట కూడా చైనా తీరు స‌రిగా లేద‌ని పాంపియో విమ‌ర్శించారు.

శుక్ర‌వారం ఓ టీవీ షోలో పాల్గొన్న పాంపియో.. సుమారు 60 వేల మంది చైనా సైనికులు ఉత్త‌ర భార‌త స‌రిహ‌ద్దుల్లో ఉన్న‌ట్లు చెప్పారు. టోక్యోలో జ‌రిగిన క్వాడ్ స‌మావేశంలో భార‌త విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌తో పాంపియో భేటీ అయ్యారు. చైనాలోని క‌మ్యూనిస్టు పార్టీతో క్వాడ్ దేశాల‌కు ప్ర‌మాదం పొంచిన‌ట్లు పాంపియో వెల్ల‌డించారు.