New Delhi, October 10: దేశంలో గడిచిన 24 గంటల్లో 73,272 కొత్త కేసులు (Coronavirus in India) నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 69,79,424కు (Coronavirus Outbreak in India) చేరుకుంది. గత 24 గంటల్లో 926 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,07,416 కు (Coronavirus Deaths in India) చేరుకుందని శనివారం కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం రికవరీల సంఖ్య 59,88,822కు చేరుకుంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 8,83,185 గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసులు 12.65 శాతం ఉన్నాయి.
ఇటీవల 9లక్షలకు పైగా యాక్టివ్ కేసులు ఉంటూ ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 9లక్షల దిగువకు వచ్చింది. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోందని, ప్రస్తుతం ఇది 85.81 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.54 శాతానికి పడిపోయింది. దేశవ్యాప్తంగా నిన్న 11,64,018 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని భారతీయ వైద్య పరిశోధనా మండలి (ఐసీఎమ్మార్) తెలిపింది. దీంతో అక్టోబర్ 9 వరకు మొత్తం 8,57,98,698 నమూనాలను పరీక్షించామని వెల్లడించింది.
ఇక కరోనా వైరస్ (China Coronavirus) తమ దేశంలోనే పుట్టిందన్న విమర్శలను చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి హువా చున్‌యింగ్ ఖండించారు. వాస్తవానికి ఈ వైరస్ గత ఏడాది ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ప్రాణం పోసుకుందని స్పష్టం చేశారు.అయితే, తమ దేశంలో బయటపడ్డ వైరస్ ఆనవాళ్ల గురించి ప్రపంచంలో ఇతర దేశాల కంటే ముందే తాము రికార్డు చేసి, బయటపెట్టామని అన్నారు. అందుకే కరోనా చైనాలో పుట్టిందన్న ప్రచారం మొదలైందని పేర్కొన్నారు. కరోనా ఎక్కడ మొదలైందనే విషయాన్ని తేల్చడానికి సమగ్రమైన దర్యాప్తు చేస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) ప్రకటించిన సంగతి తెలిసిందే.