Covid-19 Updates: కరోనాపై మరో షాకింగ్ న్యూస్, ప్రతి పదిమందిలో ఒకరు కోవిడ్ బారిన పడ్డారు, సంచలన విషయాలను వెల్లడించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ, మెజార్టీ జనాభాకు కరోనా ముప్పు ఉందని హెచ్చరిక
WHO Executive Director Michael J Ryan (Photo-ANI)

Geneva,Oct 6: చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటినీ గడగడలాడిస్తున్న సంగతి విదితమే.అయితే దీనిపై తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రపంచవ్యాప్తంగా సుమారు పది మందిలో ఒకరు కరోనా బారినపడ్డారని (One in 10 worldwide may have had virus) ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఉన్నత స్థాయి అత్యవసర నిపుణుడు మైఖేల్ జె. ర్యన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరెంతో మంది కరోనా సంబంధిత సమస్యలతో సతమతమవుతున్నారని ఆయన (Michael J. Ryan) తెలిపారు. ప్రపంచ జనాభా 760 కోట్లలో, 76 కోట్ల మంది కరోనా బారిన పడ్డారన్న డబ్ల్యూహెచ్‌వో అంచనాలతో, జాన్సన్‌ హాకిన్స్‌ యూనివర్సిటీ అంచనాలు సరిపోయాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 3.5 కోట్ల మందికి పైగా కరోనా బాధితులున్నారని ఆయన తెలిపారు.

సోమవారం (అక్టోబర్ 5) డబ్ల్యూహెచ్‌వోకు (World Health Organization) చెందిన 34 మంది ఎగ్జిక్యూటివ్ సభ్యులతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ర్యాన్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా 10 శాతం మంది కొవిడ్‌ బారిన పడినట్లు డబ్ల్యూహెచ్‌వో అంచనా వేస్తోందని తెలిపారు.

చైనాలో మళ్లీ కరోనావైరస్, తాజాగా మెయిన్‌లాండ్‌లో 10 మందికి కోవిడ్ పాజిటివ్, విదేశాల నుంచి వస్తున్న వారితో కరోనా వస్తుందని తెలిపిన చైనా జాతీయ ఆరోగ్య కమిషన్

ఈ సమావేశాలకు భారత్ నేతృత్వం వహించింది. భారత ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ అధ్యక్షతన ఈ ప్రత్యేక సమావేశాలు జరిగాయి. ఈ సమావేశంలో మైఖేల్ జె. ర్యన్ మాట్లాడుతూ.. దేశం, ఆయా దేశాల్లోని గ్రామీణ, నగర ప్రాంతాలను బట్టి కరోనా ప్రభావం మారుతోందని ర్యాన్ పేర్కొన్నారు. వ్యాధి వ్యాప్తి కొనసాగుతూనే ఉందని, మనం ఇప్పుడు సంక్లిష్టమైన కాలంలోకి వెళ్తున్నామని ఆయన హెచ్చరించారు.

వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ బహుమానాలు, హెపటైటిస్ సి వైరస్‌ను కనిపెట్టినందుకు అవార్డులు,ఈ వ్యాధి ద్వారా కాలేయ క్యాన్సర్‌ సోకే ప్రమాదం

ఆగ్నేయ ఆసియాలోని కొన్ని ప్రాంతాల్లో కరోనా విజృంభణ కొనసాగుతోందని.. యూరప్‌ సహా పలు ప్రాంతాల్లో కేసులు, మరణాలు పెరుగుతున్నాయని మైకేల్ ర్యాన్‌ చెప్పారు. మొత్తంమీద ప్రపంచంలోని మెజార్టీ జనాభాకు కరోనా ముప్పు ఇంకా తొలగిపోలేదని వివరించారు. కరోనా వైరస్‌ తొలుత ఎలా వ్యాపించింది అనే అంశంపై విచారణలో భాగంగా చైనా వెళ్లే నిపుణులకు సంబంధించిన జాబితాను చైనా అధికారుల పరిశీలన కోసం సమర్పించినట్లు ఆయన తెలిపారు. ప్రపంచం మొత్తం కరోనా వైరస్‌ వ్యాప్తి కొనసాగుతున్నదని, రాబోయే రోజుల్లో మరింత కష్టకాలన్ని ఎదుర్కోనున్నదని ఆందోళన వ్యక్తం చేసింది.