COVID-19 Outbreak in India | File Photo

Beijing, Oct 3: చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా పాకిన విషయం విదితమే. అయితే చైనా కోవిడ్ ను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చింది. అయినప్పటికీ మళ్లీ చైనాలో కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయినట్లుగా తెలుస్తోంది. తాజాగా చైనా దేశంలోని మెయిన్‌లాండ్‌లో (mainland) 10 మందికి కరోనా (Coronavirus in China) సోకింది. దీంతో చైనాలో మొత్తం విదేశాల నుంచి వచ్చిన 2,885 మందికి కరోనా సోకిందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ శనివారం వెల్లడించింది.

చైనా దేశంలోని షాంఘై నగరంలో 4, గుంగ్ డాంగ్ లో 3, సిచూన్ లో 2, షానక్సీలో 1 కేసు (COVID-19 cases) వెలుగుచూశాయని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది. 2,696 మంది కరోనా రోగులు కోలుకొని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో 189 మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని చైనా ఆరోగ్య కమిషన్ పేర్కొంది. తాజాగా కరోనా వచ్చిన రోగుల్లో మృతులు లేరని, కోలుకుంటున్నారని చైనా ఆరోగ్య కమిషన్ అధికారులు వివరించారు.

ఇంగ్లాండ్‌లో కరోనా వైరస్‌ తీవ్రత మళ్లీ పెరుగుతోంది. సెకండ్‌ వేవ్‌ మొదలైనట్లు ప్రభుత్వం అంచనా వేస్తోంది. గత వారం 99 మంది, ఈవారంలో 139 మంది ప్రాణాలు కోల్పోయారు. మహమ్మారి నియంత్రణ చర్యలను ప్రభుత్వం కఠినతరం చేసింది. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధని 18 ఏళ్లు పైబడిన వారికి 200 పౌండ్ల (రూ.18,950) జరిమానా విధిస్తారు.

కేవలం 10 నిమిషాల్లోనే కరోనా ఫలితం, కొత్త టెక్నాలజీని అభివృద్ధి చేసిన కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కరోనా లక్షణాలను గుర్తించడం ఎలాగో తెలుసుకోండి

రెండోసారి ఇదే పునరావృతం అయితే 400 పౌండ్లు చెల్లించాల్సిందే. ఉల్లంఘన మళ్లీ జరిగే రెండింతల జరిమానా విధిస్తారు. పదేపదే తప్పు చేస్తే గరిష్టంగా 6,400 పౌండ్లు (రూ.6.06 లక్షలు) చెల్లించాల్సి రావొచ్చు. దేశంలో ప్రతి 10 వేల మందిలో 100 మంది కరోనా బారినపడ్డారు.

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కల్లోలాన్ని రేపుతున్నా తమ దేశంలో అది నియంత్రణలోనే ఉందని, పరిస్థితులు సురక్షితంగా ఉన్నాయని ఉత్తర కొరియాకు చెందిన అమెరికా రాయబారి కిమ్‌ సోంగ్‌ బుధవారం ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో ప్రకటించారు. కరోనాకుం సంబంధించిన వివరాలు, సూచనలు కిమ్‌ సోంగ్‌ లైవ్‌ ద్వారా వివరించడం గమనార్హం. మహమ్మారి కాలంలో విదేశీయులెవరినీ తమ దేశంలోకి రానివ్వలేదని చెప్పారు. కోవిడ్‌ నిబంధనలు పాటించాల్సిందిగా అత్యున్నత అలర్ట్‌ ఇచ్చినట్లు వెల్లడించారు.

ఆస్పత్రిలో చేరిన అమెరికా అధ్యక్షుడు, డొనాల్డ్ ట్రంప్, ఆయన భార్య మెలానియాకి కరోనా, మాస్క్ ధరించకపోవడం వల్లే కరోనా వచ్చిందని తెలిపిన ట్రంప్‌ ప్రత్యర్థి జో బైడెన్‌

ఆయా నిబంధనలు పాటించకపోతే సహించబోయేది లేదని కిమ్‌ ప్రభుత్వం చెప్పిందని అన్నారు. దీనికి సంబంధించి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్‌ పాలక పార్టీ సభ్యులతో మంగళవారం ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు అక్కడి ప్రభుత్వ మీడియా తెలిపింది. అందులో ప్రధానంగా యాంటీ వైరస్‌ క్యాంపెయిన్‌పై చర్చించినట్లు పేర్కొంది. ఉత్తర కొరియాలో ఒక్క కరోనా కేసు కూడా రాలేదని ఆ దేశం చెబుతుండగా, విదేశీ నిపుణులు దాన్ని కొట్టిపారేస్తున్నారు