Stockholm, October 5: వైద్య రంగంలో 2020 సంవత్సరానికి గాను ముగ్గురికి నోబెల్ బహుమానాలు (Nobel Prize in Medicine 2020 Winners) వరించాయి. ఇందులో ఇద్దరు అమెరికన్ శాస్త్రవేత్తలు కాగా, మరొకరు బ్రిటిష్ శాస్త్రవేత్త. అమెరికాకు చెందిన హార్వే, చార్లెస్ ఎం.రైజ్, బ్రిటీష్ కు చెందిన హైకెల్ హోటాలన్‌కు ఈ పురస్కారం లభించింది.
హెపటైటిస్ సి వైరస్‌ను (Hepatitis C virus) కనిపెట్టినందుకు గాను వీరికి ఈ అవార్డును ప్రకటించారు. హెపటైటిస్ (Hepatitis C Symptoms) అనేది కాలేయానికి సంబంధించిన వ్యాధి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ఈ వ్యాధి బాధిస్తోంది. దీంతో క్యాన్సర్ కూడా సోకే ప్రమాదముంది.
ఇది వైరస్, బాక్టీరియా, ప్రోటోజోవా, కొన్ని రకాల మందులు వాడడం ద్వారా సంభవిస్తుంది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని వేధిస్తున్న ప్రధాన అరోగ్య సమస్యల్లో ఇది ఒకటి.
దీని వలన ఎంతో మంది కాలేయ క్యాన్సర్ బారిన పడుతున్నారు. జె.హార్వే, మైకేల్ హోటాన్, చార్లెస్ ఎం.రైజ్ పరిశోధన వలన సులభంగా హైపటైటిస్‌కు మందుకు కనుగొనడమే కాకుండా ఎంతో మంది ప్రాణాలకు వైద్యులు కాపాడగల్గుతున్నారు. వైద్యరంగంలో చేసిన సేవలకు గుర్తింపుకుగాను ఈ ఏడాది నోబెల్ పురస్కారాన్ని వీరికి ప్రకటించారు.