CRPF Women Commandos: రంగంలోకి మహిళా సీఆర్పీఎఫ్ కమాండోలు, ఆయుధాలు లేకుండానే శత్రువులను మట్టుపెట్టేలా ట్రైనింగ్, త్వరలోనే అమిత్ షా, మన్మోహన్ సహా వీఐపీల భద్రతకు కేటాయింపు
హోం మంత్రి అమిత్ షా(Amith shah), కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ(Sonia Gandhi) సహా పలువురు వీవీఐపీల భద్రతా బాధ్యతల్లో సీఆర్‌పీఎఫ్ మహిళా కమెండోలు పాలుపంచుకోనున్నారు.
New Delhi December 23: ప్రత్యేకంగా శిక్షణ పొందిన సీఆర్పీఎఫ్ కు చెందిన మహిళా కమెండోల(CRPF Women Commandos ) బృందం త్వరలోనే వీఐపీలకు భద్రత కల్పించనుంది. హోం మంత్రి అమిత్ షా(Amith shah), కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ(Sonia Gandhi), రాహుల్ గాంధీ(Rahul gandhi), ప్రియాంక గాంధీ(Priyanka gandhi), మాజీ ప్రధాని మన్మోహన్ దంపతులు (Manmohan) సహా పలువురు వీవీఐపీల భద్రతా బాధ్యతల్లో సీఆర్‌పీఎఫ్ మహిళా కమెండోలు పాలుపంచుకోనున్నారు.
వీవీఐపీలు ఇంట్లో ఉన్నపుడు రక్షణ, నిఘా బాధ్యతలు చూస్తారు. త్వరలో 5 రాష్ట్రాల ఎన్నికల్లో(5 states elections) అగ్రనేతలు పర్యటించినపుడు మహిళా కమెండోలు వీరి వెన్నంటే ఉండి బాధ్యతలు నిర్వర్తిస్తారు. మొత్తంగా 32 మందితో సిద్ధమైన కమెండోల(women commandos) దళాన్ని రంగంలోకి దింపనున్నారు. ఆయుధాలు లేకుండానే శత్రువుతో పోరాడటం, అన్ని రకాల ఆయుధాలను వాడే నైపుణ్యం, డేగ కళ్లతో చుట్టూరా చూస్తూ వీవీఐపీలకు పొంచి ఉన్న ముప్పును పసికట్టడం, భద్రత కల్పించడం తదతర అంశాల్లో వీరంతా 10 వారాల కఠోర శిక్షణను పూర్తిచేశారు.
వచ్చే ఏడాది జనవరిలో వీరిని విధుల్లోకి తీసుకుంటారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ముందుగా ఢిల్లీలో జెడ్+ కేటగిరీలో ఉన్న అమిత్, మన్మోహన్ దంపతులు తదితరుల రక్షణ బాధ్యతలను వీరికి అప్పగిస్తారు. రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్లినపుడు వీవీఐపీలు బస చేసిన ఇంట్లో తనిఖీ బాధ్యతలు వీరివే.