Lookout Notice Against Harsha Sai: హర్షసాయి కేసులో బిగ్ ట్విస్ట్, లుక్ అవుట్ నోటీసులు జారీ చేసిన సైబరాబాద్ పోలీసులు, గాలింపు వేగవంతం
ఓ నటిపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి. కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు.. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. హర్ష సాయి తనపై లైంగిక దాడికి చేయడంతో పాటు నగ్న చిత్రాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని ముంబయికి చెందిన పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Hyderabad, OCT 05: యూ ట్యూబర్ హర్షసాయిపై (Harsha Sai) సైబరాబాద్ పోలీసులు శనివారం లుకౌట్ నోటీసు (Lookout Notice)లు జారీ చేశారు. ఓ నటిపై లైంగిక దాడికి పాల్పడ్డట్లు ఆరోపణలున్నాయి. కేసు దర్యాప్తులో వేగం పెంచిన పోలీసులు.. ఈ మేరకు నోటీసులు జారీ చేశారు. హర్ష సాయి (Harsha Sai Case) తనపై లైంగిక దాడికి చేయడంతో పాటు నగ్న చిత్రాలతో బెదిరింపులకు పాల్పడుతున్నాడని ముంబయికి చెందిన పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు సెప్టెంబర్ 24న కేసు నమోదు చేసిన విషయం తెలిసింది. సదరు నటి హర్ష సాయితో కలిసి సినిమాలో నటించడంతోపాటు నిర్మాతగానూ వ్యవహరించింది. అంతకు ముందు ఓటీటీ రియాలిటీ షోలో పాల్గొన్నది.
పోలీసుల కథనం ప్రకారం.. హర్షసాయి, ముంబయి నటి మధ్య ఓ పార్టీలో కలిశారు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఇద్దరు ఏకాంతంగా ఉన్న సమయంలో ఫొటోలు తీసుకొని బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించింది. కేసు దర్యాప్తులో ఉన్న సమయంలో హర్షసాయిపై మరొకరు సైతం పోలీసులను ఆశ్రయించింది. నటి కేసు నేపథ్యంలో హర్షసాయి పరారీలో ఉన్నట్లుగా పోలీసులు వర్గాలు తెలిపాయి. అతని కోసం గాలిస్తున్నామని.. ఈ క్రమంలో లుక్ అవుట్ నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అయితే, యూ ట్యూబర్ దేశం విడిచిపారిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. వేధింపుల కేసులో హర్షసాయి సోషల్ మీడియాలో పెద్ద బెట్టింగ్ మాఫియానే నడుపుతున్నాడనే ఆరోపణలున్నాయి.