Man on Charminar (Credits: X)

Hyderabad, Oct 5: హైదరాబాద్ (Hyderabad) కు మణిహారంగా నిలిచిన చారిత్రాత్మక కట్టడం చార్మినార్ (Charminar) పై ఓ వ్యక్తి హల్ చల్ సృష్టించాడు. నిషేధించబడిన పైఅంతస్తులోకి చేరి అత్యంత ప్రమాదకరంగా సర్కస్ ఫీట్లు చేశాడు. దీంతో ఒకింత ఆందోళనకర పరిస్థితులు ఎదురయ్యాయి. అయితే, అతను ఎవరు? అక్కడికి ఎలా వెళ్లాడు? అనే విషయంపై స్పష్టత లేదు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్‌ మీడియాలో వైర‌ల్ గా మారింది.

సినీ నటుడు రాజేంద్రప్రసాద్ ఇంట విషాదం.. గుండెపోటుతో నటుడి కుమార్తె మృతి

Here's Video:

ఎలా వెళ్లాడు??

చార్మినార్ కట్టడాన్ని చూడటానికి దేశంలో ఎక్కడెక్కడి నుంచో టూరిస్టులు వస్తూ ఉంటారు. విదేశీయులు రావడం కూడా నిత్యకృత్యమే. దీంతో చార్మినార్ పై భారీభద్రత ఉంటుంది. అలాంటి సెక్యురిటీ కవచాన్ని తప్పించుకొని దుండగుడు అంత ఎత్తుకు ఎలా వెళ్లాడన్న దానిపై అనుమానాలు కలుగుతున్నాయి.

చ‌త్తీస్ గ‌ఢ్ లో భారీ ఎన్ కౌంట‌ర్, భ‌ద్ర‌తా బ‌ల‌గాల స్పెష‌ల్ ఆపరేష‌న్, 30 మంది న‌క్స‌ల్స్ మృతి