Gayatri (Credits: X, Google)

Hyderabad, Oct 5: విలక్షణమైన నటనతో టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendra Prasad) ఇంట విషాదం నెలకొంది. ఆయన కుమార్తె (Daughter) గాయత్రి (38) గుండెపోటుతో మృతి చెందారు. గాయత్రి నిన్న కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. దీంతో ఆమెను హుటాహుటిన హైదరాబాద్ లోని ఏఐజీ హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు మెరుగైన చికిత్స అందించినప్పటికీ, ఆమె కన్నుమూశారు.

చ‌త్తీస్ గ‌ఢ్ లో భారీ ఎన్ కౌంట‌ర్, భ‌ద్ర‌తా బ‌ల‌గాల స్పెష‌ల్ ఆపరేష‌న్, 30 మంది న‌క్స‌ల్స్ మృతి

కుమార్తె వీడటంతో..

రాజేంద్రప్రసాద్ కు ఒక కూతురు, కుమారుడు ఉన్నారు. కూతురిపై రాజేంద్రప్రసాద్ కు అమితమైన ప్రేమ. అలా ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు మృతి చెందడంతో ఆయన కన్నీరుమున్నీరవుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. గాయత్రి మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపాన్ని ప్రకటిస్తున్నారు.

సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం, తిరుమల లడ్డూ కల్తీ వివాదంపై స్వతంత్ర సిట్‌ ఏర్పాటుపై సీఎం చంద్రబాబు ట్వీట్