Dantewada, OCT 04: ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh)లో భారీ ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. నారాయణ్‌పూర్ – దంతెవాడ సరిహద్దుల్లో ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో 30 మంది మావోయిస్టులు మరణించినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు. బస్తర్ రేంజ్‌లోని (Bastar region) దంతెవాడ, నారాయణ్‌పూర్ (Narayanpur – Dantewada) జిల్లాల సరిహద్దుల్లో ఉండే అబూజ్‌మడ్ దండకారణ్యంలో మావోయిస్టులు నక్కి ఉన్నట్లు పోలీసులకు ముందుగా సమాచారం అందింది. దీంతో భద్రతా సిబ్బంది ఈ ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.
Here's the Tweet
Chhattisgarh: 30 naxals killed so far in the encounter with Police in Maad area on Narayanpur-Dantewada border. A huge amount of automatic weapons recovered. Search operation is underway. Further details awaited. pic.twitter.com/3tweIUd6YX
— ANI (@ANI) October 4, 2024
ఈ క్రమంలో భద్రతా దళాలను చూసిన మావోలు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన సిబ్బంది ఎదురుకాల్పులకు దిగి.. 30 మంది మావోలను మట్టుబెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఘటనాస్థలం నుంచి భారీ ఎత్తున పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడ ఆపరేషన్ కొనసాగుతోంది.