Cyclone Biparjoy: కోట్ లఖ్‌పత్ సమీపంలో తీరాన్ని తాకిన బిపర్ జాయ్ తుపాను, అర్థరాత్రి పూర్తిగా తీరం దాటే అవకాశం, భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఈ ప్రభావంతో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో కూడిన భీకరమైన గాలులు, మరోవైపు కుండపోత వర్షంతో కురుస్తోంది. తీరం దాటే సమయానికి వాయు వేగం ఇంకా పెరగనుంది.
గత కొన్ని రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న బిపర్‌జాయ్ తుపాన్ కోట్ లఖ్‌పత్ సమీపంలో గుజరాత్ తీరాన్ని తాకింది. ఈ ప్రభావంతో గంటకు వంద కిలోమీటర్ల వేగంతో కూడిన భీకరమైన గాలులు, మరోవైపు కుండపోత వర్షంతో కురుస్తోంది. తీరం దాటే సమయానికి వాయు వేగం ఇంకా పెరగనుంది.
గంటకు 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలు జారీ అయ్యాయి. అర్ధరాత్రి 12 గంటల ప్రాంతంలో బిపర్‌జోయ్ పూర్తిగా తీరం దాటే అవకాశం ఉంది. తీరం దాటాక తీవ్ర తుపానుగా.. ఆపై వాయుగుండంగా బలహీనపడుతుంది. ఆ సమయంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఆరు మీటర్ల ఎత్తున అలలు ఎగసిపడే ఛాన్స్ ఉంది.
తీరం దాటే ప్రాంతంలో ఉన్న దాదాపు 20 గ్రామాలకు చెందిన ప్రజలను ఇప్పటికే తాత్కాలిక పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇప్పటి వరకు దాదాపు లక్ష మందిని తుపాను ప్రభావిత ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
Videos
బిపార్జాయ్ తుఫాను కారణంగా గుజరాత్, మహారాష్ట్రతోపాటు ఎనిమిది రాష్ట్రాలకు అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇప్పటికే తీర ప్రాంతాలకు ఎన్డీఆర్ఎఫ్ తోపాటు భారత భద్రతా బలగాలు కూడా చేరుకున్నాయి. కాగా, గురువారం అర్ధరాత్రి 11.30 గంటల సమయంలో బిపార్జాయ్ పూర్తిగా తీరం దాటే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తెలపారు. తీరం దాటిన తర్వాత తీవ్ర తుపానుగా.. ఆ తర్వాత వాయుగుండంగా బలహనీపడుతుందని వెల్లడించారు.