Cyclone Dana Update: ఊపిరి పీల్చుకున్నట్లే ఇక, ఎట్టకేలకు తీరం దాటిన ‘దానా’ తుపాను, ఒడిషాలో కొనసాగుతున్న భారీ వర్షాలు, స్కూళ్లకు సెలవులు
గురువారం అర్ధరాత్రి 1.30 నుంచి 3.30 గంటల మధ్య ఒడిశాలోని భితార్కానికా, ధమ్రా ప్రాంతాల మధ్య తీరం దాటి తుపాన్ ప్రస్తుతం బలహీనపడనుంది.
వాయువ్వ బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తీవ్ర తుఫాను (Cyclone Dana) తీరందాటింది. గురువారం అర్ధరాత్రి 1.30 నుంచి 3.30 గంటల మధ్య ఒడిశాలోని భితార్కానికా, ధమ్రా ప్రాంతాల మధ్య తీరం దాటి తుపాన్ ప్రస్తుతం బలహీనపడనుంది. తుపాను తీరం దాటే సమయంలో భద్రక్, కేంద్రపార జిల్లాల్లో గంటలకు 120 కి.మీ వేగంతో తీవ్రంగా గాలులు వీచాయి. గాలుల దాటికి పలుచోట్ల చెట్లు నేలకూలాయి.
తుపాన్ ప్రభావంతో ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యా సంస్థలకు శుక్రవారం సెలవు ప్రకటించాలని అధికారులు రెండు రాష్ట్రాలకు సూచించారు. కోల్‌కతా, భువనేశ్వర్ ఎయిర్‌పోర్ట్‌ను గురువారం సాయంత్రం శుక్రవారం 9 గంటల వరకు మూసి ఉంచనున్నారు. రెండు రాష్ట్రాల్లో మొత్తం 400 రైళ్లను రద్దు చేశారు. అధికారులు తుపాను ప్రభావితమయ్యే ప్రాంతాలను నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ చేపట్టారు.
తీరాన్ని తాకే సమయంలో అలలు కొన్ని మీటర్ల ఎత్తు వరకు ఎగిసిపడ్డాయి. తీరప్రాంత జిల్లాలైన భద్రక్, జగత్సింగ్పుర్, ధర్మ, బాలాసోర్, కేంద్రపరాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆయా జిల్లాల్లో వేల సంఖ్యలో చెట్లు నేలకొరిగాయి. కాగా, దానా తుపాను శుక్రవారం తెల్లవారుజామున ఒడిశా తీరాన్ని దాటిందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 15 కిలోమీటర్ల వేగంతో ఉత్తర-వాయువ్య దిశగా కదిలిన తుఫాను, కేంద్రపరా జిల్లాలోని భితార్కానికా, భద్రక్‌లోని ధమ్రా మధ్య తీరాన్ని తాకినట్లు వెల్లడించింది.
తుఫాన్ నేపథ్యంలో అప్రమత్తమైన ఒడిశా ప్రభుత్వం ఏడు వేల పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. లోతట్టు ప్రాంతాల్లోని హైరిస్క్ జోన్ల నుంచి 6 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇక బెంగాల్‌లో కూడా దానా తుఫాన్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల నుంచి 3.5 లక్షల మందికిపైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సీఎం మమతా బెనర్జీ తెలిపారు. రెండు రాష్ట్రాల్లో శుక్రవారం స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. తుఫాను ప్రభాను ప్రభావం విమానాల రాకపోకలపై పడింది. భువనేశ్వర్‌లోని బిజు పట్నాయక్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని, కోల్‌కతా ఎయిర్‌పోర్టును అధికారులు మూసివేశారు. 4 వేల రైళ్లను రద్దు చేశారు.