Cyclone Nisarga: పెను తుఫాన్ భయం, వణుకుతున్న మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు, వందేండ్ల తర్వాత తొలిసారిగా ముంబైపై విరుచుకుపడనున్న నిసర్గ తుఫాన్
తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా తుఫాను కొనసాగుతోంది. ఉత్తర మహారాష్ట్ర వైపు గంటకు 12కి.మీ వేగంతో ప్రయాణిస్తోంది. అలీబాగ్‌కు దక్షిణ నైరుతి దిశగా 140 కి.మీ, ముంబైకి 190 కి.మీ, సూరత్‌కు 415 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ రోజు ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌కు ఆనుకుని హరిహరేశ్వర్-దామన్ మద్య అలీబాగ్‌కు సమీపంలో నిసర్గ తుఫాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుండి 120 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది.
Mumbai, June 3: నిసర్గ తుఫాను (Cyclone Nisarga) బుధవారం ఉదయం తీవ్ర తుఫానుగా మారింది. తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా తుఫాను కొనసాగుతోంది. ఉత్తర మహారాష్ట్ర వైపు గంటకు 12కి.మీ వేగంతో ప్రయాణిస్తోంది. అలీబాగ్‌కు దక్షిణ నైరుతి దిశగా 140 కి.మీ, ముంబైకి 190 కి.మీ, సూరత్‌కు 415 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ రోజు ఉత్తర మహారాష్ట్ర, దక్షిణ గుజరాత్‌కు ఆనుకుని హరిహరేశ్వర్-దామన్ మద్య అలీబాగ్‌కు సమీపంలో నిసర్గ తుఫాను తీరం దాటనుంది. తీరం దాటే సమయంలో గంటకు 100 నుండి 120 కి.మీ వేగంతో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా 8909 తాజా కేసులు నమోదు, దేశంలో 2 లక్షల దాటిన కోవిడ్-19 కేసులు, 5815కు చేరిన మరణాల సంఖ్య
ఇవాళ మధ్యాహ్నం ముంబై తీరాన్ని నిసర్గ (Cyclone Nisarga Updates) తాకే అవకాశాలు ఉన్నట్లు భారతీయ వాతావరణ శాఖ (India Meteorological Department) అధికారులు తెలిపారు. ఇప్పటికే కరోనా వైరస్ బాధితులతో అల్లాడుతున్న ముంబై మహానగరానికి ఇప్పుడు తుఫాన్ మరో పెను ప్రమాదంగా మారనున్నది. సుమారు వందేండ్ల తర్వాత తొలిసారి దేశ వాణిజ్య నగరంపై తుఫాన్ భారీగా ప్రభావం చూపే అవకాశం ఉండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం హై అలెర్ట్ ప్రకటించింది. ఇదిలా ఉంటే గత రెండు వారాల్లో భారత్‌పై ప్రభావం చూపనున్న రెండవ తుఫాన్ ఇది. బీచ్‌లు, పార్క్‌లు, తీరం వద్దకు ఎవరూ రాకూడదని ఆదేశాలు జారీ చేశారు. మహారాష్ట్ర, గుజరాత్, డమన్ అండ్ డయూ, దాద్ర నగర్ హవేలీలో హెచ్చరికలు జారీ చేశారు. కరోనా యాప్‌ను ప్రారంభించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో 10 మందికి కరోనా వైరస్
గుజరాత్ (Gujarat), మహారాష్ట్రలపై ( Maharashtra) నిసర్గ తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండనున్న నేపథ్యంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందస్తు సహాయక చర్యలు చేపడుతున్నారు. గుజరాత్‌లోని వల్సాద్, సూరత్, నవ్‌సారీ, భరూచి జిల్లాల్లోని తీరప్రాంతాల్లో నివసించే 78,971 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిసర్గ తుపాను తాకిడిని తట్టుకునేందుకు రాష్ట్రంలో అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నట్టు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించారు. తుపాను 16 ఎన్‌డీఆర్‌ఎఫ్ యూనిట్లలో 10 బృందాలు తుఫాను సహాయక చర్యల్లో ఉన్నాయని ఇంకా 6 బృందాలు సిద్ధంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది.
ముంబై పరిసర ప్రాంతాల్లో సుమారు 20 ఎన్డీఆర్ఎఫ్ దళాలను మోహరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎం ఉద్దవ్ ఠాక్రే పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని కొంకన్ జిల్లాలతో పాటు పుణె జిల్లాకు ప్రత్యేకంగా హెచ్చరికలు జారీ చేశారు. సైక్లోన్ నిసర్గ నేపథ్యంలో రైల్వే శాఖ కూడా ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నది.
తుఫాన్ పట్ల అప్రమత్తమైన గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం వల్సాడ్, నవ్‌సరీ జిల్లాల్లోని 47 తీర ప్రాంత గ్రామాల నుంచి 20 వేల మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది. వారం రోజుల వ్యవధిలో నిసర్గ తుఫాన్ దూసుకొస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. 24 గంటలు పనిచేసే కంట్రోల్ రూమ్‌ను ప్రారంభించింది. ఐఎండీతో సమన్వయం చేసుకోవాలని ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌కు సూచించింది. మహారాష్ట్ర, గుజరాత్ సీఎంలతో మాట్లాడిన ప్రధాని మోదీ, తుఫాన్ పరిస్థితిపై సమీక్షించారు. ప్రజలు క్షేమంగా ఉండాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ట్వీట్ చేశారు.
నిసర్గ’ అంటే పకృతి అని అర్థం. బంగ్లాదేశ్ సూచించిన ఈ పేరును అరేబియా సముద్రంలో ఏర్పడిన తాజా తుఫాన్‌కు ఐఎండీ ఖరారు చేసింది. కమిటీలోని 13 దేశాలు సూచించిన 169 పేర్లతో కూడిన జాబితాను ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదల చేసింది