Delhi Covid 19: కరోనా యాప్‌ను ప్రారంభించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో 10 మందికి కరోనా వైరస్
Delhi CM Launches New App For COVID-19 Patients (Photo Credits: ANI)

New Delhi, June 2: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హాస్పిటల్ బెడ్స్, ఇతర సమాచారం కోసం కరోనా యాప్ ను (Corona App) ప్రారంభించారు. కరోనా బారిన పడిన వారి చికిత్స, ఆసుపత్రిలోకావాల్సిన సౌకర్యాలపై అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే.. ఏయే హా‍స్పిటల్‌లో ఎన్నెన్ని పడకలు ఖాళీగా ఉన్నాయో లాంటి వివరాలు లభిస్తాయని ఢిల్లీ సీఎం (CM Arvind Kejriwal) తెలిపారు. కరోనా భయంతో కరువైన మానవత్వం, ఢిల్లీలో నడిరోడ్డుపై వృద్ధుడు పడిపోతే పట్టించుకోని వైనం

కోవిడ్‌-19 (Delhi Covid 19) రోగులకు ఆసుపత్రి పడకలు, వెంటిలేటర్లను ట్రాక్ చేయడానికి ఈ మొబైల్ అప్లికేషన్‌ను తీసుకొచ్చామని, ఇది ఢి‍ల్లీ ప్రజలందరికీ ఆసుపత్రి పడకలు, ఇతర అవసరాల లభ్యతమై సమాచారాన్ని అందిస్తుందని కేజ్రీవాల్ చెప్పారు. ఇకపై హెయిర్‌కట్‌ చేయించుకోవాలంటే ఆధార్ కార్డు,మొబైల్ నంబర్ తప్పనిసరి, చెన్నైలో కోవిడ్ 19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నిబంధనలు విధించిన తమిళనాడు సర్కారు

ఒకవేళ ఆసుపత్రిలో బెడ్‌ లభ్యత విషయంలో ఏదైనా సమస్య ఏర్పడితే ప్రజలు హెల్ప్‌లైన్ నెం. 1031కు కాల్‌ చేయవచ్చని ముఖ్యమంత్రి వెల్లడించారు. వెంటనే వారికి ఒక ఎస్‌ఎంఎస్‌ వస్తుందని వివరించారు. యాప్‌ అందుబాటులో లేనివారు వెబ్‌సైట్‌ ద్వారా, వాట్సాప్‌ నెంబరు ద్వారా కూడా సమాచారాన్ని పొందవచ్చన్నారు. ఢిల్లీలో మొత్తం 302 వెంటిలేటర్లు అందుబాటులో ఉన్నాయనీ, వీటిలో 210 ఖాళీగా ఉన్నాయని తెలిపారు.

Here's ANI Tweet

ఈ యాప్‌లో సమాచారాన్ని రోజుకు రెండుసార్లు, ఉదయం 10, సాయంత్రం 6 గంటలకు అప్‌డేట్‌ చేస్తామని దీంతో ప్రజలకు తాజా వివరాలు అందుబాటులో ఉంటాయన్నారు. వలస కూలీలకు ఉచితంగా కండోమ్‌లు, అవాంఛిత గర్భధారణను నిరోధించేందుకు కీలక నిర్ణయం తీసుకున్న బీహార్ ప్రభుత్వం

ఢిల్లీలోని గ‌వ‌ర్న‌ర్ అనిల్ బైజాల్ ఆఫీసులో సుమారు ప‌ది మందికి క‌రోనా వైర‌స్ పాజిటివ్ వ‌చ్చింది. న్యూఢిల్లీలోని సివిల్ లైన్స్‌లో ఉన్న రాజ్ నివాస్ మార్గ్‌లో ప‌నిచేస్తున్న గ‌వ‌ర్న‌ర్‌ సిబ్బందికి వైర‌స్ సోకిన‌ట్లు తేలింది. లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ ఆఫీసులో ప‌నిచేస్తున్న అంద‌రికీ కోవిడ్‌19 ప‌రీక్ష‌లు చేయించారు. ఆ నివేదిక‌లు పెండింగ్‌లో ఉన్న‌ట్లు తెలుస్తోంది. ఐసీఎంఆర్‌ శాస్త్ర‌వేత్త‌కు కోవిడ్-19 పాజిటివ్, నీతిఆయోగ్‌ అధికారికి కరోనా, వారం రోజుల పాటు ఢిల్లీ రాష్ట్ర సరిహద్దుల మూసివేత, దేశ రాజధానిలో 19,000కు చేరువలో కరోనా కేసులు

హౌజ్ స్టాఫ్‌కు చెందిన రిపోర్ట్‌లు ఇవాళ రానున్న‌ట్లు అధికారులు చెప్పారు.కాగా గత నెల 28వతేదీన ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంటుకు కరోనా వైరస్ సోకింది. 24 గంటల్లో 204 మంది మృతి, 5,598కు చేరిన కోవిడ్-19 మరణాలు, దేశంలో 198,706కు పెరిగిన కరోనా కేసులు, 40 వేల మార్కును దాటిన ముంబై

కరోనా సోకిన ఉద్యోగి లెఫ్టినెంట్ గవర్నర్ సెక్రటేరియెట్ బంగ్లాలో గ్రీవెన్స్ సెల్ విభాగంలో పనిచేశాడని అధికారులు చెప్పారు. దీంతో కరోనా బాధితుడిని ఆసుపత్రికి తరలించి కార్యాలయంలో ఉన్న 40 మంది ఉద్యోగులకు కరోనా పరీక్షలు చేశారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలోని 10 మందికి కరోనా సోకిందని తేలింది.లెఫ్టినెంట్ గవర్నర్ కార్యాలయంలోనే కరోనా వైరస్ ప్రబలడంతో దానికి సమీపంలోనే ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్, పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ బంగ్లాలులు ఉన్నాయి.