Covovax: కోవోవాక్స్‌ కొవిడ్‌ టీకాకు అనుమతి, 12 ఏళ్లు పైబడిన వారందరికి టీకా వేసేందుకు డీసీజీఐ అంగీకారం, 2707 మంది పిల్లలపై కంపెనీ ట్రయల్స్‌

ఈ విషయాన్ని సీరం సీఈవో అదర్‌ పునావాలా (Adar Poonawalla) వెల్లడించారు.

Adar Poonawalla (Photo Credits: Twitter)

New Delhi, Mar 9: సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాకు చెందిన కోవోవాక్స్‌ కొవిడ్‌ టీకాకు అత్యవసర వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా (DCGI) అనుమతి ఇచ్చింది. ఈ విషయాన్ని సీరం సీఈవో అదర్‌ పునావాలా (Adar Poonawalla) వెల్లడించారు. టీకా 12 ఏళ్లు పైబడిన వారందరికి టీకా వేసేందుకు డీసీజీఐ (DCGI) అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. కోవోవాక్స్‌ (Covovax) టీకా 18 సంవత్సరాలు అంతకంటే తక్కువ వయసున్న వారికి అందుబాటులోకి వచ్చిన నాల్గో టీకాగా నిలిచింది.

కంపెనీ అత్యవసర వినియోగం కింద టీకా వేసేందుకు దరఖాస్తు చేసుకోగా.. ఇటీవల సీడీఎస్‌సీవో కొవిడ్‌-19 సబ్జెక్ట్‌ నిపుణుల కమిటీ ఇటీవల సిఫారు చేసింది. ఈ క్రమంలో తాజాగా డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇచ్చింది. 12-17 సంవత్సరాల మధ్య వయసున్న 2707 మంది పిల్లలపై కంపెనీ ట్రయల్స్‌ నిర్వహించిందని గత నెలలో ఎస్‌ఐఐ డైరెక్టర్‌ ప్రకాశ్ కుమార్‌ సింగ్‌ తెలిపారు. ట్రయల్స్‌ కోవోవాక్స్ టీకా ప్రభావవంతంగా, సురక్షితమైందని తేలిందని, రోగనిరోధక శక్తిని చూపించిందని పేర్కొన్నారు.

ఇంటర్నెట్ లేకుండా డబ్బులు పంపవచ్చు, ఫీచర్ ఫోన్ వినియోగదారుల కోసం ఆర్‌బీఐ నుంచి 123పే, యూపీఐ 123 పే ఎలా వాడాలో గైడ్ మీ కోసం

ఇక కోర్బీవ్యాక్స్ వ్యాక్సిన్‌ను 5 నుంచి 12 ఏళ్ల మ‌ధ్య పిల్ల‌ల‌కు అత్య‌వ‌స‌ర వినియోగం కింద‌ ఇచ్చేందుకు అనుమ‌తి ఇవ్వాల‌ని హైద‌రాబాద్‌కు చెందిన బ‌యోలాజిక‌ల్-ఈ సంస్థ ద‌ర‌ఖాస్తు చేసుకున్న‌ది. ఆ వ్యాక్సిన్‌కు చెందిన డేటాను నిపుణుల క‌మిటీకి స‌మ‌ర్పించారు. ఎమ‌ర్జెన్సీ వాడ‌కంపై ఆ క‌మిటీ త్వ‌ర‌లో నిర్ణ‌యాన్ని వెల్ల‌డించ‌నున్న‌ది. పిల్ల‌ల‌కు కోర్బీవ్యాక్స్ వినియోగంపై డ్ర‌గ్స్ కంట్రోల‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఇండియా అనుమ‌తి ఇవ్వ‌నున్న‌ది. వ్యాక్సిన్ ఎంత వ‌ర‌కు సుర‌క్షిత‌మైందో తెలుసుకున్న త‌ర్వాతే ఆ టీకాను నిపుణుల క‌మిటీ గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తుంది. సార్స్ సీవోవీ2 స్పైక్ ప్రోటీన్‌లో భాగాన్ని తీసుకుని కోర్బీవ్యాక్స్ టీకాను రూపొందించారు.