Delhi: ఇన్‌స్టాగ్రామ్‌లో నగ్నంగా ఫోటోలు పంపిన 14 ఏళ్ల బాలిక, నాతో సెక్సీగా చాట్ చేయాలంటూ 17 ఏళ్ల బాలుడు బ్లాక్ మెయిల్, బాలిక తండ్రి ఫిర్యాదుతో అరెస్ట్ చేసిన పోలీసులు
దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల విద్యార్థి దూర విద్య ద్వారా డిగ్రీ చదువుతున్నాడు. 14 ఏళ్ల బాలిక వ్యక్తిగత ఫొటోలను అతడు సంపాదించాడు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమెను సంప్రదించి వాటిని పంపాడు.
New Delhi, JAN 27: నగ్న ఫొటోలు (Nude photos), వీడియోలు పంపాలని, లైంగికంగా చాటింగ్ (Chat), ఇతర కార్యకలాపాల కోసం బాలికను బలవంతం చేస్తున్న విద్యార్థిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో (Delhi) ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల విద్యార్థి దూర విద్య ద్వారా డిగ్రీ చదువుతున్నాడు. 14 ఏళ్ల బాలిక వ్యక్తిగత ఫొటోలను అతడు సంపాదించాడు. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఆమెను సంప్రదించి వాటిని పంపాడు. మరిన్ని నగ్న చిత్రాలు, వీడియోలు పంపాలని బ్లాక్‌మెయిల్ చేశాడు. సెక్సీగా చాట్ చేయాలంటూ బలవంతం చేశాడు. దీంతో ఆ బాలిక తన ప్రైవేట్ ఫొటోలు(Praivate photos), వీడియోలను అతడికి పంపుతున్నది.
కాగా, బాలిక తండ్రికి ఈ విషయం తెలిసింది. దీంతో ఆయన సైబర్ పోర్టల్ (Cyber portal) ద్వారా ఫిర్యాదు చేశాడు. ఈ నేపథ్యంలో ఐపీ అడ్రస్, మొబైల్ ఐఎంఈఐ నంబర్ ద్వారా ఆ విద్యార్థిని పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు. అతడి మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మరింత మంది బాలికల నగ్న ఫొటోలు, వీడియోలు అతడి మొబైల్ ఫోన్‌లో ఉన్నట్లు గుర్తించారు. ఇలాంటి ట్రిక్స్‌తో యువతులను అతడు వేధిస్తున్నాడని పోలీసులు తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.