Arvind Kejriwal in Custody: కేజ్రీవాల్ కు ముగిసిన సీబీఐ కస్టడీ, ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరిచిన అధికారులు, కస్టడీకి అప్పగింతపై తీర్పు రిజర్వ్
కాగా, ఇటీవల సీబీఐ అధికారులు తీహార్ జైలు నుంచి అర్వింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. దాంతో కోర్టు మూడు రోజుల సీబీఐ రిమాండ్ విధించింది. ఇవాళ్టితో సీబీఐ రిమాండ్ ముగియడంతో అధికారులు మరోసారి కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపర్చారు.
New Delhi, June 29: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ కన్వీనర్ అర్వింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) ను సీబీఐ అధికారులు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) లో హాజరుపర్చారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసు (Delhi liquor policy case) లో తదుపరి విచారణ నిమిత్తం కేజ్రీవాల్‌ను జ్యుడీషియల్ కస్టడీకి (Kejriwal Custody) అప్పగించాలని సీబీఐ అధికారులు కోర్టును కోరారు. కోర్టు నిర్ణయం వెలువడాల్సి ఉంది. కాగా, ఇటీవల సీబీఐ అధికారులు తీహార్ జైలు నుంచి అర్వింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేసి రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపర్చారు. దాంతో కోర్టు మూడు రోజుల సీబీఐ రిమాండ్ విధించింది. ఇవాళ్టితో సీబీఐ రిమాండ్ ముగియడంతో అధికారులు మరోసారి కేజ్రీవాల్‌ను కోర్టులో హాజరుపర్చారు.
విచారణ కోసం కేజ్రీవాల్‌ను రెండు వారాల జ్యుడీషియల్ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు. దాంతో కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. జూలై 12 వరకు కేజ్రీ రిమాండ్ కొనసాగనుంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు కేజ్రీవాల్‌ను ఈ ఏడాది ఫిబ్రవరి 19న అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయనపై దర్యాప్తు కొనసాగుతోంది. ఈ క్రమంలో ఈడీ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్‌ను అదే కేసులో నాలుగు రోజుల క్రితం సీబీఐ అరెస్ట్ చేసింది.